'పవన్! మీకంత సీన్ లేదు, మీ అన్నదమ్ములు కలిసినా ఏంచేయలేదు, బాబును గెలిపించారా?'

విజయవాడ: తెలుగుదేశం పార్టీ నేత కాట్రగడ్డ బాబు పేరు మీద విజయవాడలో మరోసారి ఫ్లెక్సీలు కలకలం రేపాయి. ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్‌వి అహంకారపూరిత మాటలు అని ఫ్లెక్సీలో పేర్కొన్నారు.

2009లో అన్నదమ్ములు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లు కలిసి ప్రచారం చేసి, పోటీ చేస్తే 20 సీట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. ఈసారి పవన్ కళ్యాణ్‌కు రెండు సీట్లు వస్తే కూడా చాలా ఎక్కువ అని ఫ్లెక్సీలో పేర్కొన్నారు. భారీగా ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ అందరినీ ఆకట్టుకుంటోంది.

 ఈ ఫ్లెక్సీలో ఏం ఉందంటే?

ఈ ఫ్లెక్సీలో ఏం ఉందంటే?

'పవన్ కళ్యాణ్ గారూ... నేను కూయందే తెల్లవారదందట.. ఓ అమాయకపు కోడి, అలాగే ఉంది మీరన్న మాట. మీరు మద్దతివ్వకపోతే చంద్రబాబు 2014లోనే రిటైరయ్యేవారా? ఎందుకీ అహంకారపు ప్రగల్భాలు? మీ అన్నదమ్ములంతా కలిసి 2009లో బరిలోకి దిగితే.. మీ కు వచ్చింది 18 సీట్లే. ఇప్పుడు తలకిందులుగా తపస్సు చేసినా... మీరు ఒకటో రెండో సీట్లు గెలిస్తే గొప్పు. అంతకుమించి మీకు సీనూ లేదు.. సినిమా లేదు' అని అందులో పేర్కొన్నారు.

Recommended Video

    చిరంజీవినే ఎదిరించిన వాడిని.. ఏపీ కోసం మోడీని కూడా ఎదిరిస్తా..! | Oneindia Telugu
     మళ్లీ చంద్రబాబు రావడం ఖాయం

    మళ్లీ చంద్రబాబు రావడం ఖాయం

    అయిదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశీస్సులతో మళ్లీ తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని, చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావడం తథ్యమని ఆ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. కింద కాట్రగడ్డ బాబు పేరు ఉంది.

    పవన్ కళ్యాణ్ చేతిలో కోడిపుంజు

    పవన్ కళ్యాణ్ చేతిలో కోడిపుంజు

    ఈ ఫోటోలో ఏర్పాటు చేసిన జనసేనాని ఫోటో కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. నేను కూయందే తెల్లవారదని ఓ అమాయకపు కోడి చెప్పినట్లుగా మీ వ్యాఖ్యలు ఉన్నాయని అభిప్రాయపడినట్లుగానే.. ఓ కోడి పుంజు పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న జనసేనాని ఫోటోను పెట్టారు.

    కలకలం రేపుతోన్న ఫ్లెక్సీ

    కలకలం రేపుతోన్న ఫ్లెక్సీ

    తద్వారా, కాట్రగడ్డ బాబు జనసేనానిపై ప్రశ్నలు కురిపించారని చెప్పవచ్చు. సినిమా రాజకీయం కుదరదని, 2009లో అన్నదమ్ములు కలిసి కూడా పద్దెనిమిది సీట్లు మాత్రమే గెలిచారని, అలాంటి మీరు చంద్రబాబును గెలిపించానని చెప్పడం విడ్డూరంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ ప్లెక్సీ విజయవాడలో కలకలం రేపుతోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+