2024 ఎన్నికల్లో పోటీ పై లోకేష్ తేల్చేసారు - ఆ నిర్ణయం వెనుక : సీఎం జగన్ కు కొత్త సవాల్...!!

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన మనసులో మాట బయట పెట్టారు. 2019 ఎన్నికల్లో ఓటమితో ..2024 ఎన్నికల్లో పోటీ పైన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం టీడీపీలో హాట్ టాపిక్ గా మారుతోంది. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం పని చేసిన లోకేష్..పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తొలి సారిగా చట్టసభల్లో కాలు పెట్టారు. ఎమ్మెల్యేగా..ఆ తరువాత మంత్రిగా పని చేసారు. తెలంగాణలో నాడు కేసీఆర్ - కేటీఆర్ తో చంద్రబాబు - లోకేష్ ను పోల్చుతూ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం సాగింది. లోకేష్ ను దొడ్డి దారిన మంత్రిని చేసారంటూ పెద్ద ఎత్తున రాజకీయంగా విమర్శలు వచ్చాయి.

2019లో పరాజయం..పరాభవం

2019లో పరాజయం..పరాభవం

దీంతో..2019లో లోకేష్ ను మంగళగిరి నియోజకవర్గం నుంచి చంద్రబాబు బరిలోకి దింపారు. అమరావతి రాజధానిగా ప్రకటించటం..మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని గ్రామాలు రాజధానిలోనే ఉండటం..అక్కడ పొలాలకు మంచి రేటు రావటంతో లోకేష్ గెలుపు సులువని అంచనా వేసారు. కానీ, సీన్ రివర్స్ అయింది. అంచనాలు తప్పాయి. అక్కడ అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామక్రిష్ణారెడ్డికే తిరిగి వైసీపీ నుంచి జగన్ పోటీకి దింపారు. అక్కడ లోకేష్ ను ఓడించటం కోసం వైసీపీ స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగారు.

లోకేష్ ను ఓడించేందుకు రంగంలోకి

లోకేష్ ను ఓడించేందుకు రంగంలోకి

జగన్ సోదరి షర్మిల... మోహన్ బాబు వంటి వారు సైతం లోకేష్ ఓటమి కోసం ప్రచారం నిర్వహించారు. చివరగా.. ప్రచారానికి వచ్చిన జగన్ మంగళగిరిలో ఆర్కేను గెలిపిస్తే మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. ఇక, ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చినా.. ఆర్కేకు మంత్రి పదవి రాలేదు. ఇదే సమయంలో ఎమ్మెల్యేగా సైతం అమరావతిలోనేనే లోకేష్ గెలవలేకపోయారంటూ వైసీపీ ఇప్పటికీ ఎద్దేవా చేస్తూనే ఉంది. ఇక, అనూహ్యంగా సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తెర మీదకు తీసుకొచ్చారు. అది అక్కడి గ్రామాల ప్రజల్లో నిరసనకు కారణమైంది. అమరావతిని చంద్రబాబు తానే నిర్మించానని..పూర్తి చేస్తానని చెప్పినా..అమరావతి పరిధిలోకి వచ్చే తాడికొండ - మంగళగిరి నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్దులే 2019లో విజయం సాధించారు.

ఓడిన చోటే నిలుస్తా.. గెలుస్తా

ఓడిన చోటే నిలుస్తా.. గెలుస్తా

ఇప్పుడు తన మనసులో మాట బయట పెట్టారు. తాను వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచే పోటీ చేస్తానని..ఖచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేసారు. లోకేష్ ఇప్పటి వరకు మంగళగిరి నుంచి పోటీ చేయాలా వద్దా అనే సంశయం కొనసాగుతున్నా..వైసీపీలో చోటు చేసుకున్న తాజా పరిణామాలు... రాజధాని వ్యవహారం తనకు కలిసి వస్తుందని లోకేష్ అంచనా వేస్తున్నారు. మాజీ మంత్రి మంగళగిరి మాజీ ఎమ్మెల్యే మురుగుడు హనుమంత రావుకు తాజాగా సీఎం జగన్ చేనేత వర్గ కోటాలో ఎమ్మెల్సీ చేసారు. అది సామాజికంగా మంగళగిరి నియోజవకర్గంలో కలిసి వస్తుందనే లెక్కలతో ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇది..సహజంగానే ఆర్కే మద్దతుదారుల్లో ఆగ్రహానికి కారణమవుతోంది.

వైసీపీకి సవాల్ గా...ఏం జరుగుతోంది

వైసీపీకి సవాల్ గా...ఏం జరుగుతోంది

ఇవన్నీ కలిసి.. మంగళగిరిలో వైసీపీకి మైనస్ అవుతాయని అంచనాకు వచ్చిన లోకేష్... పూర్తిగా ఇదే నియోజకవర్గం పైన ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. ఎక్కడ తాను ఓడానో..తిరిగి అక్కడి నుంచే గెలిచి తన పైన విమర్శలు .. ఎద్దేవా చేసిన వారికి సమాధానం చెప్పాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో..వైసీపీ సైతం ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం జగన్ నివాసం ఉన్న నియోజకవర్గమైన మంగళగిరిలో గెలిచి తీరాలని భావిస్తోంది. దీంతో...ఇప్పుడు ఈ నిర్ణయం టీడీపీ - వైసీపీల్లో కీలక చర్చగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+