కోర్టులో చంద్రబాబు ప్రత్యేక అభ్యర్దన - సీఐడీ మరో పిటీషన్, బెయిల్ ప్రయత్నాలు..!!

చంద్రబాబు బెయిల్ కోసం టీడీపీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజలు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ స్కాంలో నేరపూరిత కుట్రకు చంద్రబాబు పాల్పడ్డారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని న్యాయస్థానం వ్యాఖ్యానించారు. చంద్రబాబు న్యాయవాదులు వర్తించదని వాదించిన 409 సెక్షన్ వర్తిస్తుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. హౌస్ అరెస్ట్ గా పరిగణించాలని కోర్టు ను చంద్రబాబు కోరారు. అటు హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి.

చంద్రబాబు రెండు పిటీషన్లు:చంద్రబాబు అరెస్ట్ సమయం నుంచి 36 గంటల ఉత్కంఠ కొనసాగింది. ఈ ఉదయం ఏసీబీ కోర్టులో ప్రారంభమైన వాదనలు దాదాపు ఏడున్నార గంటలు కొనసాగింది. తీర్పు కోసం సమయం తీసుకున్న న్యాయమూర్తి అయిదు గంటల తరువాత వెలువరించారు. కోర్టులో జరిగిన వాదనల్లో అటు చంద్రబాబు తరపు న్యాయవాదులు పూర్తిగా సాంకేతికపరమైన అంశాలపైనే ఎక్కువగా వాదించారు.

TDP Leader Moves house motion petition for Chandra Babus bail in High Court after ACB Court Judgement

చంద్రబాబు పై సీఐడీ నమోదు చేసిన 409 సెక్షన్ వర్తించదని వాదించారు. అదే సమయంలో ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఇదే కేసులో..ఈ సెక్షన్ పై గతంలో హైకోర్టులో జరిగిన వాదనలు..నిర్ణయాలను ప్రస్తావించారు. ప్రస్తత కేసులో తీర్పులో న్యాయమూర్ి 409 సెక్షన్ వర్తిస్తుందని స్పష్టం చేసారు.

సీఐడీ వాదనతో ఏకీభవిస్తూ:స్కిల్ స్కాంలో చంద్రబాబు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారనే సీఐడీ వాదనలతో కోర్టు ఏకీభవించింది. దీంతో 14 రోజుల రిమాండ్ విధిస్తూతీర్పు ఇచ్చింది. వెంటనే చంద్రబాబు తరపు న్యాయవాదులు రెండు పిటీషన్లు దాఖలు చేసారు. అందులో ఒకటి గృహనిర్బంధంలో ఉంచేందుకు అనుమతించాలని పిటిషన్‌ కాగా, రెండోది ఇంటి భోజనం, మందులు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.

ఇక, చంద్రబాబు అరెస్ట్ కు గవర్నర్ అనుమతి లేదంటూ ఈ రోజు జరిగిన వాదనల్లో చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించారు. మాజీ ముఖ్యమంత్రి అనేది గౌరవ హోదా మాత్రమేనని...చంద్రబాబు ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారని వివరించారు. అరెస్ట్ ముందు స్పీకర్ కు సమాచారం ఇచ్చామని వెల్లడించారు. దీంతో, తీర్పు సమయంలో చంద్రబాబు తరపు న్యాయవాదుల అభిప్రాయం పరిగణలోకి తీసుకోలేదని నిర్ధారణ అయింది.

TDP Leader Moves house motion petition for Chandra Babus bail in High Court after ACB Court Judgement

రాజమండ్రికి తరలింపు..!:ఇటు చంద్రబాబు బెయిల్ కోసం న్యాయవాదులు ప్రయత్నాలు ముమ్మరం చేసారు. ఇదే సమయంలో సీఐడీ కోర్టులో మరో పిటీషన్ దాఖలు చేసింది. చంద్రబాబును విచారణకు ఇవ్వాలని కోరింది. దీన పైన సోమవారం విచారణ జరిగే అవకాశం కనిపిస్తోంది. కోర్టు రిమాండ్ విధించటంతో వెంటనే పోలీసులు చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు. సిట్ కార్యాలయానికి తరలించారు.

ఈ రాత్రికి చంద్రబాబును రాజమండ్రికి తరలిస్తారని తెలుస్తోంది. ఇక, రేపు (సోమవారం) హైకోర్టులో బెయిల్ కోసం లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేయనున్నారు. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని భావించిన టీడీపీ నేతలు ఒక్క సారిగా డీలా పడ్డారు. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+