అనపర్తి సీటు వివాదంలో కొత్త ట్విస్ట్ - పురందేశ్వరి తాజా ఆఫర్..!!

ఏపీలో ఎన్నికల రాజకీయంలో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. కూటమి అభ్యర్దుల సీట్ల వ్యవహారంలో కొన్ని మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు బీజేపీ, టీడీపీ నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అనపర్తి సీటు నుంచి టీడీపీ తమ జాబితాలో అభ్యర్దిని ప్రకటించింది. కానీ, ఆ తరువాత బీజేపీకి కేటాయించిన పది సీట్లలో అనపర్తి నుంచి అభ్యర్దిని ఖరారు చేసింది. దీంతో, వివాదం మొదలైంది. ఇప్పుడు ఈ సీటు విషయంలో కొత్త ట్విస్టు చోటు చేసుకుంది.

అనపర్తి రగడ
టీడీపీ ప్రకటించిన స్థానంలో బీజేపీ తమ అభ్యర్దిని ప్రకటించటంతో వివాదం మొదలైంది. టీడీపీ అభ్యర్దిగా నల్లిమిల్లి ప్రచారం ప్రారంభించిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతో, నల్లిమిల్లి మద్దతు దారులు ఆందోళనకు దిగారు. తాజాగా నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. సీటు పైన హామీ ఇచ్చారు. కానీ, బీజేపీ మాత్రం తమ అభ్యర్దిని మార్చేందుకు సిద్దంగా లేదని ప్రచారం సాగుతోంది. మాజీ సైనికుడు శివకృష్ణంరాజుకు కేటాయించిన టికెట్‌ మార్చాల్సిన అవసరమేంటనే టాక్ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. రాజమండ్రి ఎంపీగా పురందేశ్వరి పోటీ చేస్తుండటంతో అనపర్తి నుంచి టీడీపీ అభ్యర్ది పోటీ చేస్తేనే మెజార్టీ దక్కుతుందని భావిస్తున్నారు.

TDP Leader Nallamilli got offer form bjp for Anaparthy seat as alliance chandrababu to take final decision

నల్లమిల్లికి దక్కేనా
దీంతో, తాజాగా నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితో సమావేశమయ్యారు. పురందేశ్వరి తమ పార్టీ అభ్యర్దిని ప్రకటించటంతో..అక్కడ మార్పు విషయంలో చోటు చేసుకుంటున్న సమస్యలను వివరించారు. నల్లిమిల్లిని బీజేపీలోకి రావాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇందుకు నల్లిమిల్లి నో చెప్పారని ఆయన అనుచర వర్గం చెబుతోంది. నల్లిమిల్లి తిరిగి టీడీపీ నుంచి సీటు దక్కించుకొనే ప్రయత్నం చేస్తూనే..నియోజకవర్గంలో పర్యటన..ప్రచారం కొనసాగిస్తున్నారు. తాను ఇతర పార్టీలోకి వెళ్లే ప్రసక్తేలేదన్నారు. తాను చేపట్టిన న్యాయం కోసం కార్యక్రమానికి ప్రజల నుంచి సానుకూలమైన స్పందన వచ్చాయన్నారు. కార్యకర్తల నిర్ణయం మేరకే భవిష్యత్‌ కార్యాచరణ ఉంటుందని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్పష్టం చేసారు.

TDP Leader Nallamilli got offer form bjp for Anaparthy seat as alliance chandrababu to take final decision

తుది నిర్ణయం ఏంటి
బీజేపీ ఇప్పటికే టికెట్‌ కేటాయించిన శివకృష్ణంరాజుది ఆర్‌ఎస్‌ఎస్‌ కుటుంబమే. ఆయన తండ్రి బీజేపీకి పని చేశారు. తన తండ్రి వైద్యం కోసం ఆర్మీకి వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకుని వచ్చిన శివకృష్ణంరాజు క్రమంగా జిల్లా బీజేపీలో క్రియాశీలకంగా మారారు. 4 సంవత్సరాలుగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. సంవత్సరకాలంగా అనపర్తి నియోజకవర్గ కన్వీనర్‌గా కొనసాగుతున్నారు.
దీంతో, నల్లిమిల్లికి సీటు దక్కుతుందా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. బీజేపీ అభ్యర్దినే కొనసాగిస్తే నల్లిమిల్లి కార్యాచరణ ఏంటనేది నియోజకవర్గం ఫలితం లో కీలకం కానుంది. దీంతో, అనపర్తి సీటు పై తుది నిర్ణయం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+