Nara Lokesh: నారా లోకేష్ కాన్వాయ్ తనిఖీలు-పోలీసులు ఏం తేల్చారంటే ?
ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. దీంతో అధికార, విపక్షాలన్న తేడా లేకుండా రాజకీయ పార్టీలు, నేతలందరికీ ప్రోటోకాల్ తో కూడా సంబంధం లేకుండా తనిఖీలు చేపడుతున్నారు. ఈసీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో అనుమానం ఉన్న నేతలందరిపైనా నిఘా కూడా పెట్టారు. ఇదే క్రమంలో ఇవాళ ఉండవల్లి నుంచి తాడేపల్లికి బయలుదేరిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వాహనాలను కూడా పోలీసులు తనిఖీలు చేశారు.
ఉండవల్లి కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసం నుంచి ఇవాళ నారా లోకేష్ తాడేపల్లికి బయలుదేరారు. లోకేష్ కాన్వాయ్ లో పలు వాహనాలు ఉన్నాయి. తాడేపల్లిలోని అపార్ట్ మెంట్ వాసులతో ముఖాముఖీ కార్యక్రమానికి లోకేష్ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఉండవల్లి సమీపంలోనే ఆయన కాన్వాయ్ ని పోలీసులు ఆపారు. దీంతో ఆయన కూడా వాహనాల తనిఖీకి సహకరించారు. పోలీసులు కాన్వాయ్ లోని అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

ఉండవల్లి కరకట్ట సమీపంలో ఎన్నికల విధుల్లో భాగంగా నారా లోకేష్ కాన్వాయ్ ఆపి చెక్ చేసిన పోలీసులు..!#NaraLokesh #TDP #ApPolice #AndhraPradesh #ApElections2024 #AndhraPradeshElections2024 #ApAssemblyElections2024 #Oneindiatelugu pic.twitter.com/ZXf69YdEYU
— oneindiatelugu (@oneindiatelugu) March 20, 2024
అనంతరం లోకేష్ కాన్వాయ్ లోని వాహనాల్లో ఎన్నికల కోడ్ నిబంధనలకు విరుద్ధంగా ఏమీ లేదని నిర్ధారించుకున్నారు. ఈ మేరకు వాహనాలు బయలుదేరేందుకు పోలీసులు క్లియరెన్స్ ఇచ్చారు. దీంతో లోకేష్ తాడేపల్లికి బయలుదేరి వెళ్లిపోయారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి మరోసారి టీడీపీ అభ్యర్ధిగా బరిలో ఉన్న లోకేష్.. ఇవాళ తాడేపల్లిలోని పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించబోతున్నారు.












Click it and Unblock the Notifications