అరెరె.. కాలు జారె
వినుకొండ: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఇవ్వాళ్టికి 175వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఈ పాదయాత్ర పల్నాడు జిల్లాలో కొనసాగుతోంది. జిల్లా కేంద్రం వినుకొండ నియోజకవర్గం మీదుగా సాగుతున్నారాయన. చీమకుర్తి మీదుగా సంతనూతనపాడులో ఎంట్రీ ఇచ్చారు.
బాపట్ల జిల్లాలో పాదయాత్రను ముగించుకుని పల్నాడులో అడుగుపెట్టిన నారా లోకేష్‌కు జిల్లా నాయకులు ఘన స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించారు. ఈ క్రమంలో 2,300 కిలో మీటర్ల మైలురాయిని అందుకున్నారు. తాము అధికారంలోకి వస్తే వినుకొండ నియోజకవర్గం పరిధిలోని కొండ్రముట్ల వద్ద తాగు-సాగునీరందించే వరికపూడిశెల ప్రాజెక్టును నిర్మిస్తానని హామీ ఇస్తూ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కొండ్రుముట్ల, సత్యనారాయణపురం, కొచ్చెర్ల, అంగలూరు మీదుగా పాదయాత్ర సాగింది.

ఇవ్వాళ పాదయాత్రకు నారా లోకేష్ బ్రేక్ ఇచ్చారు. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు చేసిన ఛైర్మన్ అజయ్ రెడ్డిపై నారా లోకేష్ క్రిమినల్ కేసును దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులకు సంబంధించి మంగళగిరి కోర్టుకు హాజరయ్యారు. న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు.
వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత, గుర్రంపాటి దేవేందర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ ఇదివరకు నారా లోకేష్ కోర్టును ఆశ్రయించారు. చినబాబు చిరుతిండి పేరుతో ఓ దినపత్రికలో కథనం పబ్లిష్ కావడంపైనా కోర్టుకెక్కారు. తనపై బురద జల్లిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాననీ హెచ్చరించారు.

మరోవంక- పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ పంట పొలాలను పరిశీలించడానికి వెళ్లినప్పుడు కాలు జారి కింద పడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా గ్రూపుల్లో ఇది వైరల్ అయింది. నిజానికి- అది పాత వీడియోనని టీడీపీ చెబుతోంది. వైసీపీ ఇప్పుడు దాన్ని వైరల్ చేసి, రాజకీయ లబ్ది పొందాలనుకుంటోందంటూ ఎదురుదాడికి దిగుతోంది.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications