వైఎస్సార్‌కు నారా లోకేష్ నివాళి- స్మృతి వనానికి చేతులెత్తి మొక్కి..!!

కర్నూలు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఇవ్వాళ్టికి 99వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఈ పాదయాత్ర నంద్యాల జిల్లాలో కొనసాగుతోంది. జిల్లాలోని శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం మీదుగా సాగుతున్నారాయన. నందికొట్కూరు నియోజకవర్గంలో పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. శ్రీశైలంలో అడుగు పెట్టారు.

నందికొట్కూరు నియోజకవర్గంలోని బన్నూరు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్రను ప్రారంభించిన నారా లోకేష్.. కృష్ణారావుపేట, రుద్రవరం, పాములపాడు, కంభాలపల్లి, ఎర్రగూడూరు మీదుగా శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్ర‌వేశించారు. ఈ సందర్భంగా ఆయనకు నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గంలోని కరివేను వద్ద అగ్రిగోల్డ్‌కు చెందిన ఫామ్ ల్యాండ్ వద్ద సెల్ఫీ దిగారు.

TDP leader Nara Lokesh

అగ్రిగోల్డ్ బాధితులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయలేకపోయారంటూ ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చిన తరువాత జగన్మోసపురెడ్డిగా మారారని ఆరోపించారు. అబద్దాలు, మోసం, నయవంచనతో ఆయన పరిపాలన సాగిస్తోన్నారంటూ ధ్వజమెత్తారు. ఆగ్రిగోల్డ్ ఆస్తులను తాము బినామీ పేర్లతో కొట్టేశామంటూ గతంలో అబద్దపు ప్రచారం చేశారని నారా లోకేష్ మండిపడ్డారు.

అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చాడని, ఇప్పుడు నాలుగు సంవత్సరాలు దాటిపోయిందని గుర్తు చేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు సత్వర న్యాయాన్ని అందించడంలో విఫలం అయ్యాడని ధ్వజమెత్తారు. వందల కుటుంబాలు అగ్రిగోల్డ్ బారిన పడి ఆర్థికంగా ఎంతగానో నష్టపోయాయంటూ నారా లోకేష్ ఆరోపించారు.

ఈ ఉదయం ఆయన ఆత్మకూరు నుంచి పాదయాత్ర మొదలు పెట్టారు. ఆత్మకూరు సమీపంలోని నల్లకాలువ వద్ద డాక్టర్ వైఎస్ఆర్ స్మృతి వనం మీదుగా వెళ్తోన్న సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్సార్ స్మృతి వనం గురించి నారా లోకేష్‌కు వివరించారు.

2009 సెప్టెంబర్ 2వ తేదీన చోటు చేసుకున్న హెలికాప్టర్ ప్రమాదంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కన్నుమూసిన విషయాన్ని గుర్తు చేశారు. దీనితో నారా లోకేష్- వైఎస్సార్ స్మృతి వనానికి నివాళి అర్పించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+