రండి, ఉద్యోగాలివ్వండి: అమెరికాలో లోకేష్(పిక్చర్స్)

హైదరాబాద్: పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌ స్వర్గధామమని, విరివిగా పెట్టుబడులు పెట్టాలని తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్‌ పారిశ్రామికవేత్తలను కోరారు.

అమెరికా పర్యటనలో ఉన్న లోకేశ్‌ పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. ఏపీ పారిశ్రామిక విధానాన్ని, అవకాశాలను, వనరులను గూర్చి వారికి వివరించారు.

సిస్కో ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ చీఫ్‌ గ్లోబలైజేషన్‌ అధికారి విమ్‌ ఎల్‌ ఫ్రింక్‌తో సమావేశమయ్యారు. విశాఖలో తమ పరిశ్రమ పెట్టేందుకు అవకాశాలపై చర్చిస్తామన్నారు.

 నారా లోకేష్

నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామమని టీడీపీ సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ అన్నారు. ఏపీలోని వనరులను, అవకాశాలను వినియోగించుకోవాలని, విరివిగా పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరారు.

 నారా లోకేష్

నారా లోకేష్

వినోద్‌ ఖోస్లాతో సమావేశమయ్యారు. లోకేశ్‌ ప్రజెంటేషన్‌ను ఆసక్తిగా విన్న ఖోస్లా ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.

 నారా లోకేష్

నారా లోకేష్

తర్వాత అమెరికా ప్రెసిడెంట్‌ మేనేజ్‌మెంట్‌ అడ్వజయిరీ బోర్డులో సభ్యుడైన, అడోబ్‌ సీఈవో శంతను నారాయణతో సమావేశమైన లోకేశ్‌ ఏపీలో అడోబ్‌ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు.

నారా లోకేష్

నారా లోకేష్

సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని నారాయణ చెప్పారు. నారా లోకేష్ అమెరికాలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఏపీలో పెట్టుబడులు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+