ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు అరెస్ట్..!!

మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ అరెస్ట్ అయ్యారు. జీఎస్టీ ఎగవేశారన్న ఆరోపణలతో ఆయనపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. అత‌డిపై జిఎస్టీ అధికారులు పిర్యాదు చేయ‌డంతో విచారణ జరిపిన పోలీసులు శరత్‌ను అరెస్ట్ చేశారు. విజయవాడ నగరంలోని మాచవరం పోలీస్ స్టేషన్‌లో శరత్‌పై కేసు నమోదు అయ్యింది. ఏపీ డైరెక్టరేట్‌ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది.

పుల్లారావు కుమారుడు శరత్‌ను పోలీసులు అరెస్ట్ చేసారు. మాచవరం పోలీస్ స్టేషన్‌లో శరత్‌పై కేసు నమోదు అయ్యింది. ఏపీ డైరెక్టరేట్‌ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది. నిధులు మళ్లించి పన్ను ఎగవేసారనే ఆరోపణలపై శరత్‌తో పాటు మొత్తం ఏడుగురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీలోని 420, 409, 467,471, 477(A),120 B రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్లపై కేసు ఫైల్ అయ్యింది. ఎఫ్‌ఐఆర్‌లో పుల్లారావు భార్య, బావమరిదితో పాటు మరో ఐదుగురుపై కేసు నమోదు అయ్యింది. అలెక్సా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పన్ను ఎగవేసారని ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు.

TDP leader Prathipati pullarao son Sarath Arrest in Revenue intelligence Case

చిలకలూరి పేట అభ్యర్థిగా పత్తిపాటి పుల్లారావు పోటీ చేస్తున్నారు. ఆయ‌న‌ను ఇబ్బంది పెట్టేందుకే ఈ అరెస్ట్ లంటూ టిడిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు వస్తున్న సమయంలో పోలీసులతో కుమ్మక్కై అధికార పార్టీ నేతలు కావాలనే టీడీపీ నేతలను అరెస్ట్ చేయిస్తున్నారని ఆరోపించారు. శరత్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొడుకు అరెస్టుపై ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు. ఓటమి భయంతో జగన్ రెడ్డి రోజురోజుకీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాజకీయక్షేత్రంలో నేరుగా ఎదుర్కోలేక తనకు అలవాటైన తప్పుడు కేసులతో ప్రత్యర్థులపై వేధింపులకు పాల్పడుతున్నారని అన్నారు. తన కుమారుడు అబ్బాయి కంపెనీలో డైరెక్టర్‌గా కూడా లేరని.., కనీసం షేర్ హోల్డర్ కూడా కాదన్నారు. అలాంటి వ్యక్తికి, జీఎస్టీ ఎగవేతలకు సంబంధం ఏంటని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+