'అంతమాటనా, రోజా! క్షమాపణ చెప్పు, రియాల్టీ-రియాల్టీ షోకు తేడా లేదా'

జాతీయ మహిళా పార్లమెంటు సదస్సును కిట్టీ పార్టీగా పేర్కొంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యల పైన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక మండిపడ్డారు.

విజయవాడ: జాతీయ మహిళా పార్లమెంటు సదస్సును కిట్టీ పార్టీగా పేర్కొంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యల పైన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక మండిపడ్డారు.

లోకసభ స్పీకర్‌ సుమిత్రా మహజన్‌, బౌద్ధమత గురువు దలైలామా, బంగ్లాదేశ్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ షర్మీన్‌ చౌదరితో పాటు ఎంతోమంది ప్రముఖులు హాజరైన సదస్సును కిట్టీ పార్టీగా పేర్కొనడం ఆమె అహంకారానికి పరాకాష్ట అన్నారు.

TDP leader Renuka lashes out at Roja

అలా అనడం హాజరైన అతిథులను, మహిళా లోకాన్ని కించపరచడమే అన్నారు. అలా మాట్లాడినందుకు రోజా వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాద రావులను అసభ్యకర పదజాలంతో దూషించడం సబబు కాదన్నారు.

మహిళా సాధికారత కోసం రోజాలాంటి వాళ్లు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందన్నారు. రోజాకి రియాల్టీ, రియాల్టీ షోకి తేడా తెలయడం లేదని ఎద్దేవా చేశారు.

ఏపీ పోలీసులను బౌన్సర్లతో పోల్చడం ఆమె అహంకార వైఖరికి నిదర్శనమన్నారు. శాంతి భద్రతలను పరిరక్షిస్తున్న వారిని అలా అనడం వారి మనోభావాలను దెబ్బతీయడమే, వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+