జూ ఎన్టీఆర్ స్పందన సరిగా లేదు -సినిమాల కోసం విలువలను విడుస్తారా : వర్ల రామయ్య సంచలనం..!!

ప్రముఖ హీరో...జూనియర్ ఎన్టీఆర్ పైన టీడీపీ నేత వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేసారు. తాజాగా అసెంబ్లీలో జరిగిన పరిణామాల పైన జూనియర్ స్పందించిన తీరును ఆయన తప్పు బట్టారు. పార్టీ కీలక నేతగా ఉన్న వర్ల రామయ్య చంద్రబాబు కుటుంబానికి వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలంటూ విజయవాడలో దీక్ష ప్రారంభించారు. నారా భువనేశ్వరిపై కొడాలి నాని, వల్లభనేని వంశీ విమర్శలు చేస్తే ఎన్టీయార్ స్పందించిన తీరు సరిగా లేదని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. అభిప్రాయపడ్డారు. భువనేశ్వరి మేనల్లుడిగా ఎన్టీయార్ విఫలమయ్యారని విమర్శించారు.

తారక్ స్పందన సరిగా లేదు

తారక్ స్పందన సరిగా లేదు

మేనత్తను నోటికొచ్చినట్లు అంటే మేనల్లుడిగా ఆయన సరిగ్గా స్పందించలేదని రాష్ట్రం మొత్తం అనుకుంటోందని వర్ల రామయ్య చెప్పుకొచ్చారు. సినిమాల కోసం కుటుంబాన్ని.. నైతిక విలువలలను వదులుకుంటారా అంటూ వర్ల రామయ్య నిలదీశారు. దీనికి కొనసాగింపుగా..వల్లభనేని వంశీ ఫొటోలు పెట్టినప్పుడే ఎన్టీయార్ ఘాటుగా స్పందించి ఉంటే ఇంత జరిగేది కాదంటూ వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. బూతుల మంత్రి పేర్నినానికి ఎన్టీయార్ అంటే చాలా భయమని చెబుతూ.. అలాంటి వారిని కంట్రోల్‌ చేసే శక్తి ఆయనకే ఉందని చెప్పారు.

అండగా ఉన్న వాళ్లే టీడీపీ సభ్యులు

అండగా ఉన్న వాళ్లే టీడీపీ సభ్యులు


పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నవాళ్లే టీడీపీ సభ్యులని వర్ల స్పష్టం చేశారు. జూనియర్ ఎన్టీయార్‌పై తాను చేసిన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని..ఈ వ్యాఖ్యలు పూర్తిగా తన వ్యక్తిగతమని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. అయితే, జూనియర్ ఎన్టీఆర్ నాటి పరిణామాల పైన వీడియో సందేశం విడుదల చేసారు. అప్పటికే నందమూరి కుటుంబ సభ్యులు బాలక్రిష్ణతో కలిసి తీవ్ర స్థాయిలో వైసీపీ నేతలపైన మండి పడ్డారు. నందమూరి కుటుంబం మరో రూపం చూడవద్దని హెచ్చరించారు. మరోసారి ఇలాంటివి జరిగితే సహించేది లేదని తేల్చి చెప్పారు. ఆ వెంటనే జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు.

ఎవరి పేర్లు ప్రస్తావించని జూ ఎన్టీఆర్

ఎవరి పేర్లు ప్రస్తావించని జూ ఎన్టీఆర్


అయితే, తన సందేశంలో ఎక్కడా చంద్రబాబు...భువనేశ్వరి పేరు ప్రస్తావించలేదు. అదే విధంగా వైసీపీ నేతల పేర్లను..పార్టీ ని కూడా ప్రస్తావన చేయలేదు. తాను ఆ కుటుంబ సభ్యుడిగా కాకుండా...ఒక కొడుకుగా.. తండ్రిగా.. భర్తగా.. దేశ పౌరుడిగా మాట్లాడుతున్నానంటూ చెప్పుకొచ్చారు. ఇలాంటి వ్యాఖ్యలతో భవిష్యత్ తరానికి ఏమివ్వలనుకుంటు న్నారంటూ ప్రశ్నించారు. రాజకీయాల్లో విమర్శలు..ప్రతి విమర్శలు సహజమేనని చెబుతూ...అవి ప్రజల సమస్యల పైన జరగాలని పేర్కొన్నారు.

ఆ సందేశం పైన టీడీపీ నేతల అసహనం

ఆ సందేశం పైన టీడీపీ నేతల అసహనం


కానీ, ఎక్కడా వల్లభనేని వంశీ.. మంత్రి కొడాలి నాని పేర్లు ప్రస్తవన చేయకపోవటం , అదే సమయంలో తన మేనత్త అయిన భువనేశ్వరి పేరు కూడా ప్రస్తావించకుండా మాట్లాడటం టీడీపీ నేతలకు రుచించటం లేదు. దీని పైన పార్టీలోనూ చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఏకంగా వర్ల రామయ్య తన అభిప్రాయాన్ని ఓపెన్ గా చెప్పారు. కానీ, అది పార్టీ అభిప్రాయం కాదని చెప్పుకొచ్చారు. ఇక, ఇప్పుడు టీడీపీ నేత చేసిన వ్యాఖ్యల పైన జూనియర్ ఎన్టీఆర్...ఆయన అభిమానుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది చూడాలి.

టీడీపీ నేతల టార్గెట్ కొనసాగుతుందా

టీడీపీ నేతల టార్గెట్ కొనసాగుతుందా


గతంలో చంద్రబాబు కుప్పం.. మచిలీపట్నంలో పర్యటించిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకురావాలంటూ ఆయన అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. ఆ సమయంలో చంద్రబాబు నుంచి స్పందన రాలేదు. ఇప్పుడు వర్ల రామయ్య పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నవాళ్లే టీడీపీ సభ్యులని వ్యాఖ్యానించటం కొత్త చర్చకు కారణమవుతోంది. బుద్దా వెంకన్న సైతం జూనియర్ పైన కీలక వ్యాఖ్యలు చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+