పిఠాపురంలో టీడీపీ నేత వర్మకు ఘోర అవమానం
ఏపీ రాజకీయాలు మొత్తం కూడా పిఠాపరం నియోజకవర్గం చుట్టూనే తిరుగుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో తాను పిఠాపురం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో పిఠాపురం నియోజకవర్గం ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. కాపులు అధిక సంఖ్యలో ఉండటం వల్లే పవన్ కల్యాణ్ పిఠాపురంను ఎంచుకున్నారని తెలుస్తోంది. దాదాపు 70 వేలకు పైగానే కాపు ఓటర్లు నియోజకర్గంలో ఉండటంతో పవన్ అక్కడ నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నియోజకవర్గమే తనకు అనువైనదిగా పవన్ భావిస్తున్నారు.
పవన్ ఇటీవల తన ప్రసంగంలో మాట్లాడుతూ.. పిఠాపురం కాబోయే ఎమ్మెల్యే తానే అని ప్రకటించుకున్నారు. దీంతో పిఠాపురంలో పవన్ గెలుపు నల్లేరుపై నడకే అని అంతా భావించారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం దీనికి విరుద్దంగా ఉన్నట్టు కనిపిస్తోంది. పిఠాపురంలో పవన్ గెలుపు టీడీపీ నేత వర్మ మీద ఆధారపడి ఉంది. వర్మ సహకారం లేకుండా పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపు అంత ఈజీ కాదనే విషయం జనసేనకు తెలియంది కాదు.

ఈ విషయాన్ని ముందే గ్రహించిన పవన్ కల్యాణ్ పిఠాపురంలో అడుగుపెట్టగానే వర్మ ఇంట్లో భోజనం చేసి ఎన్నికల ప్రచారానికి ఆయన్ను కూడా వెంటబెట్టుకెళ్లారు. ఆ తరువాత కూడా నా గెలుపు వర్మ చేతుల్లో పెడుతున్నా అంటూ పవన్ వ్యాఖ్యానించారు. అయితే క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన నేతల మధ్య సయోధ్య కుదరడం లేదు పవన్ కల్యాణ్ గెలుపుకు కృషి చేస్తోన్న వర్మను జనసేన నాయకులు తీవ్రంగా అవమానించినట్టుగా తెలుస్తోంది. వర్మను ఎన్నికల ప్రచారంలో అవమానించడంతో ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పిఠాపురంలో టీడీపీ నేత వర్మకు ఘోర అవమానం..!#SVSNVarma #PawanKalyan #APPolitics #APElections2024 #Pithapuram #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/BJBe5bTqLD
— oneindiatelugu (@oneindiatelugu) April 12, 2024
సీటు త్యాగం చేసి పవన్ కోసం ప్రచారం చేస్తుంటే..తమకు తగినే బుద్దే చెప్పారని టీడీపీ కార్యకర్తలు వాపోతున్నారు. పవన్ కల్యాణ్ గెలుపుకు కృషి చేస్తుంటే తమ నేతను అవమానించడం ఏంటని టీడీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్మ వర్గీయులు అసభ్యపదజాలంతో జనసేన కార్యకర్తలను దూషించారు. దీంతో పిఠాపురంలో టీడీపీ , జనసేన రెండు వర్గాలు విడిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications