హిజ్రాలను వదలని టీడీపీ నాయకుడు: అందమైన యువకులతోను!, ఇదీ దందా..

Subscribe to Oneindia Telugu

విశాఖ: బెదిరింపులతో హిజ్రాలను తన దారిలోకి తెచ్చుకున్న ఓ టీడీపీ నాయకుడు.. పెద్ద దందాకే తెరలేపాడు. అమాయక యువకులను సైతం నకిలీ హిజ్రాలుగా మార్చి.. వాళ్లనూ వసూళ్లకు పంపించేవాడు. అలా ఏకంగా కోట్లకు పడగలెత్తాడు.

విశాఖ సౌత్ ఎమ్మెల్యే గణేశ్ కుమార్ ప్రధార అనుచరుడు, విశాఖపట్నం 29వ వార్డు పార్టీ అధ్యక్షుడు ఎల్లాజీ దందా బాగోతం ఇది. హిజ్రాల నాయకుడిగా వెలుగొందుతూ.. వారిని చిత్రహింసలు పాలుచేసి బలవంతంగా వారి డబ్బును లాక్కుంటున్నాడు. రోజుకింత అని ఫిక్స్ చేసి.. అడిగినంత తెచ్చివ్వకపోతే నరకం చూపిస్తున్నాడు.

Hijra

ఇటీవల ఎల్లాజీ మీద ఫిర్యాదులు ఎక్కువవడంతో.. అతని గురించి ఆరా తీసిన పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిశాయి. ఒక్కో హిజ్రా నుంచి రోజుకు రూ.300 నుంచి రూ.1వెయ్యి వసూలు చేసేవాడని, డిమాండ్ చేసినంత తెచ్చివ్వకపోతే వారికి చుక్కలు చూపించేవాడని పోలీసులు చెబుతున్నారు.

కొంతమంది అందమైన యువకులకు గాలం వేసి.. మత్తుమందులతో వారిని స్పృహ కోల్పోయేలా చేసి.. ఆపై
వారికి చీరలు, లేడీస్ డ్రెస్సులు వేసి ఫోటోలు తీయించేవాడు. అటు తర్వాత వాటిని వారి కుటుంబ సభ్యులకు పంపిస్తానంటూ బ్లాక్ మెయిల్ చేసేవాడు. డబ్బులు డిమాండ్ చేసేవాడు. తప్పించుకునే ప్రయత్నం చేస్తే తాట తీసేవాడు. అలా 300మంది హిజ్రాలను ప్రతీ నిత్యం వేధిస్తూ వస్తున్నాడు.

ఈ నేపథ్యంలో తన వద్ద నుంచి పారిపోయిన అనూష అనే హిజ్రాను సైతం ఎల్లాజీ చంపేశాడన్న ఆరోపణలున్నాయి. కిశోర్ అనే వ్యక్తితో కలిసి అనూష విజయవాడ పారిపోవడాన్ని అతను తట్టుకోలేకపోయాడని, అందువల్లే హత్య చేసి ఉంటాడని అంటున్నారు.

ఇటీవల భూపేష్ నగర్ కు చెందిన గణేశ్ అనే యువకుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తనకు మత్తు మందులు ఇచ్చి హిజ్రా వేషం వేసి ఫోటోలు తీయించాడని, ఆపై తన భార్యకు ఫోటోలు పంపిస్తానంటూ బెదిరిస్తున్నాడని పోలీసులకు చెప్పాడు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎల్లాజీని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. గతంలో అనుమానస్పద మృతిగా నమోదైన అనూష కేసును మళ్లీ తిరగదోడి విచారిస్తున్నారు. జైల్లో ఉండి కూడా ఎల్లాజీ తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని ఆదివారం 50మంది హిజ్రాలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

YSRCP To Win AP in 2019 : Survey Reports

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Yellaji, A TDP Leader was arrested by Vizag police for harassing Hizras and collecting money from them.
Please Wait while comments are loading...