అదే స్కెచ్, సేమ్ ప్లాన్ - వైసీపీ శ్రేణులపై దాడులు, లోకేశ్ కు నోటీసులు..!!

ఏపీలో రాజకీయ లెక్కలు మారుతున్నాయి. ఎన్నికల వేళ రాజకీయ దాడులు ఆందోళన పెంచుతున్నాయి. కొద్ది రోజుల క్రితం పుంగనూరులో జరిగినట్టే ఇప్పుడు భీమవరంలో చోటు చేసుకున్న పరిణామాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రశాంతంగంగా ఉండే భీమవరంలో టీడీపీ నేతలు ఉద్దేశ పూర్వకంగానే వైసీపీ కేడర్ పైన దాడులు చేసారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా నారా లోకేశ్ కు భీమవరం పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీని పైన రాజకీయ రగడ కొనసాగుతోంది.

మొన్న చంద్రబాబు పుంగనూరు టూర్..నేడు లోకేశ్ భీమవరం పర్యటనల్లో ఒకే విధమైన పరిస్థితి కనిపిస్తోంది. పుంగనూరు టౌన్లోకి వెళ్లేందుకు అనుమతులు తీసుకోనున్నా పోలీసులను ఎదిరించి బెదిరించి చివరకు దాడి చేసి అయినా నగరంలోకి ప్రవేశించాలన్న చంద్రబాబు కుట్రకు పలువురు పోలీసులు గాయపడ్డారు. ఇప్పుడు భీమవరంలోనూ అటు సీన్ రిపీట్ అయింది. పుంగనూరులో టీడీపీ ఇంచార్జ్ చల్లా బాబు సారధ్యంలో హింసకు ప్లాన్ చేసినట్లే ఇప్పుడు పచ్చని గోదావరి జిల్లాలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సారధ్యంలో టిడిపి కార్యకర్తలు చెలరేగారు. లోకేష్ పాదయాత్ర సాగుతుండగానే కర్రలు.. బియర్ సీసాలతో వైసిపి కార్యకర్తలమీద విరుచుకుపడ్డారు. రాళ్లతో దాడులు చేశారు.

TDP leaders attacked YSRCP leaders and police in Bhimavaram, Many were seriously injured

టీపీపీ కార్యకర్తలు ఉద్దేశ పూర్వకంగా సీఎం జగన్ ఫ్లెక్సీలు చించేస్తూ కేకలు.. అరుపులతో ఆ ప్రాంతాన్ని భయానకంగా మార్చేశారు. ఈ పరిణామంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. వైసిపి కార్యకర్తలు సైతం భయంతో ఇళ్లలోకి వెళ్లి దాక్కున్నారు. ఈ దాదాగిరీని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. కేవలం హింసను ప్రేరేపించి హీరోఅవ్వాలని చూస్తున్న లోకేష్ ఈ మేరకు భాషను సైతం అలాగే వాడుతున్నారు. ఒక్కోడ్ని ఉచ్చ పోయిస్తాను.. ఎర్ర బుక్కులో పేర్లు రాస్తున్నాను అంటూ బెదిరిస్తూ తమ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. ఎన్ని కేసులు ఉంటే అంత పెద్ద పదవి ఇస్తాను అంటూ లోకేష్ ఇచ్చిన బూస్ట్ ను చూసి టీడీపీ కార్యకర్తలు ఈ తరహా దాడులకు దిగుతున్నారనే అభిప్రాయం ఉంది.

ప్రజల్లో తమ పార్టీకి ఉన్న పరపతి రోజురోజుకూ తగ్గిపోతుండడంతో గూండాగిరీని నమ్ముకుని టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. భీమవరం ఘటనలతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. లోకేశ్ కు నోటీసులు ఇచ్చారు. పాదయాత్రలో భాగంగా ఒక పద్దతి ప్రకారం ఈ దాడులు జరిగినట్లు అనుమానిస్తున్నారు. వివేకాకు సంబంధించి ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేసారు. ఘటనల పైన పోలీసులు చర్యలు ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+