కొడాలి నాని ఓ పిచ్చి కుక్క : అవినీతిని బయటపెడతాం - డేరాబాబాలా జైలుకే.!! : బుద్దా వెంకన్న ఫైర్
మంత్రి కొడాలి నాని నోటికి ఆడ్డు ఆపు లేకుండా మాట్లాడుతున్నరంటూ టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇష్టం వచ్చినట్లు నోరుపారేసుకుంటే.. సీఎం జగన్ మంత్రి పదవి ఉంచుతాడనే భ్రమలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా, జంగారెడ్డిగూడెంలో నాటు సారా తాగి చనిపోతే .. బాధ్యతగా వెళ్లి చంద్రబాబు ఆ కుటుంబాలను పరామర్శించడం తప్పా అని నిలదీశారు. సీఎంగా ఉన్నా, విపక్షంలో ఉన్నా పేద కుటుంబాలకు సాయం చేయడం చంద్రబాబు నైజం. ఆ సాయాన్ని కూడా తప్పుపట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు. సాయం చేయాల్సిన ప్రభుత్వం .. ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు.

పిచ్చికుక్కను అందలం ఎక్కించి చంద్రబాబు
కమ్మసామాజిక వర్గానికి చెందిన నలుగుర్ని తిడితే నానికి ముఖ్యమంత్రి జగన్ దగ్గర పేరు వస్తుందనుకుంటే పొరపాటేనని వెంకన్న ఫైర్ అయ్యారు. చంద్రబాబు అంతు చూసే దమ్ముందా నీకు అంటూ విరుచుకుపడ్డారు. నాడు పిచ్చికుక్కను అందలం ఎక్కించి చంద్రబాబు తప్పు చేశారన్నారు.
బీ ఫాం తీసుకుని నాని గెలవలేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు చేరదీయకుంటే గుట్కా ప్యాకేట్లు భుజాన వేసుకుని బస్టాండ్, రైల్వే స్టేషన్లలో అమ్ముకునేవాడివంటూ ఎద్దేవా చేశారు. గుట్కాకి కూడా అడుక్కునే నాని.. ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. కుక్కకు ఉన్న విశ్వాసం కూడా నానికి లేదని మండిపడ్డారు.

డేరాబాబాలా నాని జైలుకే..
కొడాలి నాని అవినీతి చరిత్ర 10 రోజుల్లో బయటపెడతానని బుద్దావెంకన్న హెచ్చరించారు. గతంలో నీ ఆస్తులెంత.. ఇప్పుడెంత అని నిలదీశారు. మంత్రి పదవి చేపట్టాక.. రేషన్‌లో పందికొక్కులను తరిమేసి.. వాటి స్థానంలో నాని చేరారని ఎద్దేవా చేశారు. పందికొక్కులాగా రేషన్ బియ్యం, గోదుమలు దోచుకుంటున్నారని ఆరోపించారు. డేరా బాబా తరహాలో కొడాలి నాని కూడా జైలుకెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. శిక్షలు వేసేందుకు చట్టాలు, న్యాయాలు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు .. గుడివాడ రోడ్డుపై ఈడ్చుకుంటూ తీహార్ జైలుతో పడేస్తామని హెచ్చరించారు. గుడివాడలో ఒడించి .. నానిని తరిమి కొట్టడం ఖాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Recommended Video

పొత్తులపై ఉలుకెందుకు?
తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే నైజం నానిదని దుయ్యబట్టారు బుద్దా వెంకన్న. సీఎం జగన్ మెప్పుకోసం నోటికి ఇష్టం వచ్చినట్లు వాగితే .. బుద్ధి చెబుతామని హెచ్చరించారు. పొత్తుల గురించి చంద్రబాబు, పవన్ లు ప్రకటించకుండానే వైసీపీ నేతలకు , మంత్రులకు ఉలుకెందని మండిపడ్డారు. మైండ్ గేమ్‌తో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. పార్టీ నేతలతో చర్చించిన తర్వాత చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. పవన్ కల్యాణ్ ప్యాకేజీలు తీసుకునే వ్యక్తి కాదు.. చంద్రబాబు ఇచ్చే మనిషి కాదని స్పష్టం చేశారు. నాని వాగుడు ఆపకపోతే.. తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.
-
కుమార్తెకు లోకేష్ ఊహించని పెళ్లి గిఫ్ట్ -అవాక్కైన టీడీపీ ఎమ్మెల్యే..! -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications