టీడీపీ ముఖ్యుల భేటీ - కీలక నిర్ణయం..!?

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ చంద్రబాబు అరెస్ట్ సంచలనంగా మారింది. అటు కోర్టుల్లో బెయిల్ కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇదే సమయంలో టీడీపీ ముఖ్య నేతలు భేటీ అవుతున్నారు. చంద్రబాబు కేసు..వరుస పీటీ వారెంట్ల వేళ ఈ సమావేశంలో కీలక నిర్ణయం ప్రకటనకు అవకాశం ఉందని సమాచారం.

చంద్రబాబు అరెస్ట్ తో:టీడీపీ కష్టకాలంలో ఉంది. చంద్రబాబు అరెస్ట్ పార్టీకి భారీ షాక్ గా మారింది. టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైనా పార్టీలో ఇంకా అనిశ్చితి. అటు చంద్రబాబు బెయిల్ కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇటు టీడీపీ పైన పై చేయి సాధించేందుకు అధికార వైసీపీ ఇదే సరైన సమయంగా భావిస్తోంది.

TDP Leaders Crucial meet today to Discuss action plan amid Assembly Sessions and Chandra Babu Arrest

ఈ సమయంలోనే రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు టీడీపీ ఎమ్మెల్యేలు హాజరు అవుతారా లేదా అనే చర్చ సాగుతోంది. దీంతో, టీడీపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీకి హాజరుపైన నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. చంద్రబాబు అరెస్ట్ పైన టీడీపీ ఎంపీలు లోక్ సభలో ప్రస్తావించారు. అదే విధంగా ఏపీ అసెంబ్లీలోని ఈ అంశం పై ప్రభుత్వాన్ని నిలదీయాలనేది కొందరు టీడీపీ నేతల అభిప్రాయం.

టీడీఎల్పీ భేటీ:చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాలపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు. అసెంబ్లీకి వెళ్లి నిరసన వ్యక్తి చేయాలనే అభిప్రాయంతో పాటుగా.. అసలు అసెంబ్లీకి వెళ్లకుండా బయట ఉండి నిరసన తెలిపే ఆలోచన పైన ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించనున్నారు. చంద్రబాబు బెయిల్ అంశం పైన ఈ రోజు ఏసీబీ కోర్టులో విచారణ ఉంది. ఇదే సమయంలో టీడీఎల్పీ సమావేశం జరగనుంది. అసెంబ్లీకి వెళ్లి నిరసన వ్యక్తం చేస్తేనే పార్టీ కేడర్ కు సానుకూల సంకేతాలు వెళ్తాయని భావిస్తున్నారు. రెండు రోజుల క్రితం రాజమండ్రి జైలులో చంద్రబాబును పార్టీ నేత యనమల కలిసిన సమయంలోనూ అసెంబ్లీ వేళ వ్యూహాత్మకంగా వ్యవహరించాలని నిర్దేశించినట్లు తెలుస్తోంది.

TDP Leaders Crucial meet today to Discuss action plan amid Assembly Sessions and Chandra Babu Arrest

కీలక నిర్ణయాల దిశగా:ఇదే సమయంలో అటు ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ పైన పార్టీ ముఖ్యులతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు కేసుల వ్యవహారంతో పాటుగా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు సిద్దం అవుతున్నారు.

ప్రభుత్వం చంద్రబాబు కేసుల గురించి అసెంబ్లీలో వివరించేందుకు ప్రయత్నం చేస్తుందనే సమాచారంతో అసెంబ్లీకి హాజరై అక్కడే నిరసన వ్యక్తం చేయాలనేది టీడీపీ మెజార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయంగా తెలుస్తోంది. అదే సమయంలో అసెంబ్లీ నిర్వహణ సమయంలోనే వరుస నిరసనల దిశగా కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లు సమాచారం. దీంతో, ఈ రోజు జరిగే టీడీఎల్పీ సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+