జ‌లీల్ ఖాన్ కు జ‌ల‌క్‌: వ‌్య‌తిరేక‌మైన టిడిపి నేత‌లు : కుమార్తెకు సీటు ఉన్న‌ట్టా..లేన‌ట్టా..!

వైసిపి నుండి టిడిపిలోకి వెళ్లిన జ‌లీల్ ఖాన్ కు ఆ పార్టీ నేత‌లు జ‌లక్ ఇచ్చారు. రెండు రోజుల క్రితం త‌న కుమార్తెను వెం ట పెట్టుకొని ముఖ్య‌మంత్రి వ‌ద్ద‌కు వెళ్లిన జ‌లీల్ ఖాన్ విజ‌య‌వాడ ప‌శ్చిమ టిక్కెట్ త‌న కుమార్తెకు ఇస్తాన‌ని సీయం హామీ ఇచ్చార‌ని చెప్పారు. ఇప్పుడు..విజ‌య‌వాడ టిడిపి నేత‌లు ఇదే విష‌యం పై జ‌లీల్ ను ప్ర‌శ్నిస్తున్నారు. దీని పై ముఖ్య మంత్రిని క‌లిసి ఫిర్యాదు చేసారు. టిడిపిలో స్వ‌తంత్రంగా అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించ‌టం ఉండ‌ద‌ని..స‌మిష్టిగానే నిర్ణ‌యం ఉంటుంద‌ని తేల్చి చెబుతున్నారు.

జ‌లీల్ ఖాన్ కు వ్య‌తిరేకంగా టిడిపి నేత‌లు..

జ‌లీల్ ఖాన్ కు వ్య‌తిరేకంగా టిడిపి నేత‌లు..

2014 ఎన్నిక‌ల్లో వైసిపి నుండి గెలిచిన జ‌లీల్ ఖాన్ టిడిపిలో చేరారు. నామినేటెడ్ పోస్టు ద‌క్కించుకున్నారు. వ‌చ్చే ఎన్నిక ల్లో తాను పోటీ చేయ‌లేన‌ని..తన కుమార్తెకు సీటు ఇవ్వాల‌ని కోరుతూ ముఖ్య‌మంత్రి స‌మ‌క్షంలో కుమార్తెను టిడిపిలో చేర్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుండి త‌న కుమార్తెకు సీటు ఇస్తాన‌ని ముఖ్య‌మంత్రి హామీ ఇచ్చార‌ని జ‌లీల్ ఖాన్ చెప్పుకొచ్చారు. అయితే, దీని పై పార్టీ నుండి ఎలాంటి ప్ర‌క‌ట‌న అధికారికంగా రాలేదు. దీని పై విజ‌య‌వాడ ప‌శ్చిమం నుండి టిడిపి సీటు ఆశిస్తున్న నేత‌లు స్పందించారు. జ‌లీల్ ఖాన్ వ్య‌క్తిగ‌తంగా ఎలా సీటు కేటాయింపు విష‌యాన్ని ప్ర‌క‌టిస్తార‌ని వారు నిలదీస్తున్నారు. దీని పై ముఖ్య‌మంత్రిని క‌లిసారు. హామీ పై సీయం వ‌ద్ద ప్ర‌స్తావించారు. పార్టీలో అభ్య‌ర్ధులు ఎవ‌రికి వారు ప్ర‌క‌టించుకొనే సంస్కృతి లేద‌ని..స‌మిష్టిగానే అభ్య‌ర్దుల ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని చెబుతున్నారు. ప‌రోక్షంగా జ‌లీల్ ఖాన్ చెప్పుకుంటున్న విష‌యాన్ని ఖండించారు.

జ‌లీల్ ఖాన్ కుమార్తెకు సీటు ఉన్న‌ట్లా..లేనట్లా..

జ‌లీల్ ఖాన్ కుమార్తెకు సీటు ఉన్న‌ట్లా..లేనట్లా..

విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో తొలి నుండి టిడిపిలో ఉన్న నేత‌లు ఇప్పుడు జలీల్ ఖాన్ ప్ర‌క‌ట‌న పై ఫైర్ అవుతున్నారు. జ‌లీల్‌ఖాన్ ప్ర‌క‌ట‌న పై అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన టిడిపి నేత నాగూల్‌మీరా 1999 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్ధిగా జ‌లీల్‌ఖాన్ పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నిక‌ల్లో టిడిపి అభ్య‌ర్ధిగా నాగుల్‌మీరా ఓడిపోయారు. ఇప్పుడు తిరిగి సీటు ఆశిస్తున్న నాగుల్ మీరా నేరుగా సీయం దృష్టికి జ‌లీల్ ఖాన్ ప్ర‌క‌ట‌న విష‌యాన్ని తీసుకెళ్లారు.

సీయం

సీయం

సీయం స్పంద‌న ఏంట‌నేది తెలియ‌క పోయినా..టిడిపి నేత‌లు మాత్రం జ‌లీల్‌ఖాన్ కుమార్తెకు సీటు ఇస్తే ఎంత వ‌ర‌కు స‌హ‌క‌రిస్తార‌నేది మాత్రం ఇప్పుడు సందేహంగానే క‌నిపిస్తోంది. మ‌రి..జ‌లీల్‌ఖాన్ తాజా ప‌రిణామాల పై ఏ ర‌కంగా స్పందిస్తారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+