ఏపీ గవర్నర్‌కు పెన్ డ్రైవ్ అందజేసిన టీడీపీ నేతలు..!!
విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. అన్నమయ్య రాయచోటి జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గంలో చేపట్టిన రోడ్ షో రణరంగంగా మారిన నేపథ్యంలో.. కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఈ విషయంలో టీడీపీ తన రూటు మార్చింది. ఎస్పీలను లక్ష్యంగా చేసుకుంది.
పుంగనూరు నియోజకవర్గం పరిధిలోని అంగళ్లులో చంద్రబాబు రోడ్ షో సందర్భంగా టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున విధ్వంసానికి పాల్పడిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్సీపీ నాయకులతో ఘర్షణకు దిగారు. వారిపై రాళ్లు రువ్వారు. అడ్డొచ్చిన పోలీసులనూ వదల్లేదు. వారిపైనా రాళ్లతో దాడి చేశారు. పోలీసుల వాహనాలనూ దగ్ధం చేశారు.

ఈ ఘటనపై అన్నమయ్య రాయచోటి జిల్లా ఎస్పీ రిషాంత్ మాట్లాడారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే ఈ దాడి జరిగిందని, కొందరు ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడామని చెప్పారు. పుంగనూరు టౌన్‌లో రోడ్ షో నిర్వహించేలా ముందస్తు ప్రణాళికలో లేదని, రోడ్ షోను జాతీయ రహదారి మీదుగా చిత్తూరుకు వెళ్లేలా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారని వివరించారు.
హఠాత్తుగా టీడీపీ నాయకులు.. ఈ రోడ్ షోను టౌన్‌లోకి వచ్చేలా చేశారని చెప్పారు. వారి వద్ద బీర్ బాటిళ్లు, కర్రలు, రాళ్లతో పుంగనూరు జాతీయ రహదారికి చేరుకున్నారనడానికి తమ వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయని వివరించారు. వాటి ఆధారంగా ఈ దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేస్తామని తేల్చి చెప్పారు.
ఈ పరిణామాలన్నింటినీ తెలుగుదేశం పార్టీ.. తాజాగా గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ దృష్టికి తీసుకెళ్లింది. ఈ మేరకు ఆ పార్టీ నాయకులు వర్ల రామయ్య, బోండా ఉమామహేశ్వర రావు, గద్దె రామ్మోహన్ రావు, కొల్లు రవీంద్ర, పరుచూరి అశోక్ బాబు, నిమ్మల రామనాయుడు.. ఈ మధ్యాహ్నం విజయవాడ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. ఆయన వినతిపత్రాన్ని అందజేశారు.
నేషనల్ సెక్యూరిటీ గార్డుల భద్రతలో ఉండే చంద్రబాబుకు సరైన రక్షణ కల్పించడంలో చిత్తూరు, అన్నమయ్యా రాయచోటి జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్లు విఫలం అయ్యారని ఆరోపించారు. వారిపై వెంటనే క్రమశిక్షణ చర్యలను తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న నాయకుడు పాల్గొన్న రోడ్ షోలో ఒక పార్టీ వారికి మద్దతుగా నిలిచారని విమర్శించారు.
ఈ దాడులపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఈ మేరకు వారు గవర్నర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. దాడికి పాల్పడిన పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో.. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించేలా స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ ఘటన వెనుక మాస్టర్ మైండ్ ఎవరనేది వెలుగులోకి తీసుకుని రావాలని, దోషులకు కఠినంగా శిక్ష పడేలా ఆదేశాలు జారీ చేయాలని చెప్పారు.
పుంగనూరు దాడికి సంబంధించిన కొన్ని విజువల్స్, ఫొటోలు, దినపత్రికల్లో వచ్చిన కథనాలతో కూడిన పెన్ డ్రైవ్‌ను వారు గవర్నర్‌కు అందజేశారు. దాడుల తీవ్రతను గుర్తించాలని, చంద్రబాబుకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలం అయ్యారనడానికి ఈ పెన్ డ్రైవ్‌లో ఉన్న విజువల్స్ సాక్షమని చెప్పారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications