జ‌యంతి చేతిలో చెప్పు దెబ్బ‌లు : ఎన్టీఆర్ కు డ‌బ్బులు ఎగ్గొట్టావ్ : మోహ‌న్‌బాబు పై టిడిపి ఫైర్‌...!

వైసిపి లో చేరి చంద్ర‌బాబును ల‌క్ష్యంగా చేసుకొని ఆరోప‌ణ‌లు చేస్తున్న సినీ ప్ర‌ముఖుడు మోహ‌న్ బాబు పై టిడిపి నేత తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. వ‌రుస‌గా టిడిపి నేత‌లు మోహ‌న్ బాబు పై ఆరోప‌ణ‌లు కొన‌సాగిస్తున్నారు. చంద్ర‌బాబు పై మోహ‌న్ బాబు చేసిన ఆరోప‌ణ‌ల‌కు ధీటుగా వీరు గ‌తంలో మోహ‌న్ బాబు ఇలా చేసారంటూ ఆరోపిస్తున్నారు.

మ‌నిషిగా మోహ‌న్ బాబువా..

మ‌నిషిగా మోహ‌న్ బాబువా..

వైసీపీ నేత మంచు మోహన్‌బాబుపై టీడీపీ నేతలు విరుచుకుపడ్డారు. పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ.. ఎక్కడైనా తప్పుడు పనిచేసేవాళ్లని ‘నువ్వు మనిషివా, మోహన్‌బాబువా అంటారని, అలా ఎందుకు అంటారో ఆ సామెత ఎందుకు పుట్టిందో మోహన్‌బాబు గుర్తెరగాలి అన్నారు. వెన్నుపోటు గురించి మాట్లాడుతున్న మోహన్‌బాబు సంగతి అడిగితే లక్ష్మీ పార్వతే చెబుతారని అన్నారు. 25 ఏళ్ల కిందట నిమ్స్‌లో సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే చీపుళ్లతో తరిమికొట్టిన విషయాన్ని మోహన్‌బాబు మరిచిపోయారా. ఎయిర్‌ హోస్టెస్‌తో అసభ్యంగా ప్రవర్తించిన చరిత్ర మోహ‌న్ బాబుకు గుర్తు లేదా అంటూ అనురాధా ప్ర‌శ్నించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. మోహ‌న్ బాబు పై టిడిపి నేత‌లు మ‌రింత ఘాటు వ్యాఖ్య‌ల‌ను చేసారు.

జ‌యంతి చేతిలో చెప్పు దెబ్బ‌లు..

జ‌యంతి చేతిలో చెప్పు దెబ్బ‌లు..

సీనియర్‌ నటి జయంతి చేతిలో చెప్పుదెబ్బలు తిన్న చరిత్ర..సాక్షి శివానంద్‌పై దాడి చేసిన ఘనత మోహన్‌బాబుది. .. అంటూ పంచుమ‌ర్తి అనురాధా తీవ్ర వ్యాఖ్మ‌లు చేసారు. మోహ‌న్ బాబు త‌న కుమారుడి ప్రేమ వ్యవహారం ఓ టీవీ చాన ల్‌లో చూపితే, రివాల్వర్‌తో వెళ్లి మీడియా సిబ్బందిని బెదిరించలేదా అని ప్రశ్నించారు. టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంక న్న మోహన్‌బాబును ఊసరవెల్లితో పోల్చారు. మేజర్‌ చంద్రకాంత్‌ సినిమాలో నటించినందుకు ఎన్టీఆర్‌కు ఇవ్వాల్సిన పారితోషికం ఎగ్గొట్టిన మోహన్‌బాబు ఉత్తముడని లక్ష్మీపార్వతి స్టేట్‌మెంట్‌ ఇస్తే, తాను రాజకీయాల నుంచి తప్పుకుం టానని బుద్దావెంకన్న సవాల్‌ చేశారు. ఒక వైపు ఎన్టీఆర్ పై అభిమానం చూపిస్తున్న మొహ‌న్ బాబు వీరి వ్యాఖ్య‌ల పై ఎలా స్పందిస్తార‌నేది వేచి చూడాలి.

సినిమాలు లేక‌..వ‌ల‌స ప‌క్షి..

సినిమాలు లేక‌..వ‌ల‌స ప‌క్షి..

టిడిపి నేత‌లే కాదు..టిడిపి అధినేత సైతం మోహ‌న్ బాబు పై ఘాటుగా స్పందించారు. సినిమాలు లేక‌.. హైద‌రాబాద్ లో ఉంటూ ఇప్పుడు అమరావ‌తికి ఓ వ‌ల‌స‌ప‌క్షి వ‌చ్చిందంటూ చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. జ‌గ‌న్‌..కేసీఆర్ కు మ‌ద్ద తుగా మాట్లాడుతున్నార‌ని..వారి కి ఊడిగన చేస్తే త‌న‌కు ఇబ్బంది లేద‌ని..ఏపి గురించి త‌క్కువ‌గా మాట్లాడితే స‌హించ న‌ని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. మంగ‌ళ‌గిరి లో మోహ‌న్ బాబు మీడియా స‌మావేశంలో చేసిన వ్యాఖ్య‌ల‌ను స్పంద‌న‌గా ఇప్పుడు చంద్ర‌బాబు తో స‌హా టిడిపి నేత‌లు చేస్తున్న ఆరోప‌ణ‌ల పై మోహ‌న్ బాబు ఎలా స్పందిస్తార‌నేది ఇటు రాజ‌కీ యంగా..అటు సినిమా ప‌రిశ్ర‌మ‌లోనూ ఆస‌క్తి క‌రంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+