జగన్‌కే బుద్ధి లేదు, ఇక వారికి ఉంటుందా: టిడిపి తీవ్ర వ్యాఖ్యలు
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి లేదని, ఆయనకే లేని బుద్ధి ఇక ఆ పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబులకు ఎలా వస్తుందని, వారి నుంచి అది ఆశించడంతప్పవుతుందని టిడిపి గుంటూరు జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు అన్నారు.
ఆయన ఆదివారం నాడు విలేకరులతో మాట్లాడారు. గుడ్లగూబలు వెలుగును, గుంటనక్కలు మంచిని చూడలేవని ఎద్దేవా చేశారు. వైసిపి నాయకుల వ్యవహారం కూడా అలానే ఉందన్నారు. కోర్టులను అడ్డం పెట్టుకుని రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.

చెప్పులు కొనుక్కునే స్థోమత లేనివారు ఏకంగా సుప్రీం కోర్టుకు కూడా వెళ్తున్నారంటే వారి వెనుక ఎవరు ఉండి నడిపిస్తున్నారో ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. వ్యోక్స్ వ్యాగన్ కేసులో బొత్స, ఏపీఐసీసీ భూముల స్కాంలో రూ.వందల కోట్లు మింగిన అంబటికి అవినీతి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.
కర్నూలులో జగన్ యువభేరీ
వైసిపి అధినేత వైయస్ జగన్ మంగళవారం కర్నూలులో నిర్వహించనున్న యువభేరీ సదస్సులో పాల్గొంటారు. ప్రత్యేక హోదా విషయమై విద్యార్థులు, యువతతో ఆయన ఈ సదస్సుల్లో చర్చించడంతోపాటు, హోదా ఆవశ్యకతపై మాట్లాడుతారు.
అలాగే నవంబరు ఆరో తేదీన విశాఖ మున్సిపల్ మైదానంలో బహిరంగ సభ నిర్వహించాలని వైసిపి నిర్ణయించింది. ప్రత్యేక హోదా అంశంతో పాటు, చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు తీరు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి వంటి 25 అంశాలు అజెండాగా ఈ సభను వైసిపి నిర్వహిస్తోంది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications