మహాత్ముడి సమాధి వద్ద నల్ల బ్యాడ్జీలతో..
రాజమండ్రి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.
2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, డొల్ల కంపెనీలను సృష్టించి, ముడుపులను పొందారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి. దీనిపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.

చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై ఢిల్లీలో జాతీయ నాయకులను కలుస్తోన్న తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్.. ఇవ్వాళ రాజ్‌ఘాట్‌ను సందర్శించారు. పార్టీ ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ నారా లోకేష్ వెంట ఉన్నారు.
మాజీ ఎంపీలు నిమ్మల కిష్టప్ప, మురళీమోహన్, కొనకళ్ల నారాయణ, కంభంపాటి రామ్మోహన్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, కాల్వ శ్రీనివాసులుతో కలిసి జాతిపిత మహాత్మాగాంధీ నివాళి అర్పించారు. ఆ సమయంలో వారంతా నల్ల బ్యాడ్జీలను ధరించారు. మహాత్ముడికి నివాళి అర్పించిన అనంతరం అక్కడే మౌన ప్రదర్శన చేశారు. అక్కడే కూర్చుని నిరసన తెలియజేశారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారని, అకారణంగా ఆయనను జైల్లో ఉంచారని టీడీపీ నాయకులు ఆరోపిస్తోన్నారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారాన్ని పార్లమెంట్ లోపల, బయటా వెలుపల లేవనెత్తుతామని స్పష్టం చేశారు. తప్పుడు సాక్ష్యాధారాలతో చంద్రబాబును ఏపీ ప్రభుత్వం అరెస్ట్ చేయించిందని మరో ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ధ్వజమెత్తారు.
I paid my respects to Mahatma Gandhi Ji at Rajghat in New Delhi, accompanied by senior party leaders. We joined in a black badge protest to condemn the unjust arrest of @ncbn Garu on false charges filed by the YSRCP Government. Justice will prevail.#APvsJagan#IAmWithBabu… pic.twitter.com/ziii6jOq7n
— Lokesh Nara (@naralokesh) September 19, 2023
ముఖ్యమంత్రి వైెస్ జగన్మోహన్ రెడ్డి ఓ సైకోలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి, జగన్ ఆయనను కటకటాల వెనక్కి పంపించారని విమర్శించారు. ఈ అంశాన్ని సభలో కూడా లేవనెత్తుతామని అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామని తేల్చి చెప్పారు.
-
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications