టీడీపీ నుంచి జెడ్పీ ఛైర్మన్లుగా ఛాన్స్- కసరత్తు, జాబితాలో..!!

స్థానిక ఎన్నికల వేళ కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలను సుప్రీం సూచన ల మేరకు ఎన్నికల సంఘం రీ షెడ్యూల్ చేసింది. అటు జెడ్పీటీసీ.. ఎంపీటీసీల నామినేషన్లకు ఈ రోజు చివరి రోజు. జెడ్పీ స్థానాల పంపకాల పైన కూటమి పార్టీల మధ్య చర్చలు జరుగుతు న్నాయి. ఇదే సమయంలో జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ల ఖరారు విషయంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా పలువురు సీనియర్ల వారసులు రేసులో ఉన్నారు. వారి ఎంపిక ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

కూటమి పార్టీలు జెడ్పీ ఛైర్మన్ల ఖరారు పైన కసరత్తు చేస్తున్నాయి. మొత్తం 28 జిల్లా పరిషత్ స్థానాలను మూడు పార్టీల్లో ఎవరికి ఏ సీటు కేటాయించానే దాని పైన చర్చలు జరుగుతున్నాయి. జనసేన 7-8 జెడ్పీ స్థానాలు ఆశిస్తోంది. దీంతో.. చంద్రబాబు - పవన్ మధ్య ఈ స్థానాల పైన కీలక చర్చలు కొనసాగుతున్నాయి. కాగా.. ఈ సారి జెడ్పీ ఛైర్మన్ స్థానాల కోసం ముఖ్య నేతల వారసులు పోటీ పడుతున్నారు. అందులో భాగంగా సత్యసాయి జిల్లా నుంచి పరిటాల శ్రీరామ్ కు అవకాశం దక్కటం ఖాయమని చెబుతున్నారు. ఈ రోజు నామినేషన్లకు చివరి రోజు కావటంతో ఆశావాహులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు వద్ద సీట్ల కోసం సీనియర్లు తమ వారసుల కోసం ప్రతిపాదనలు చేసారు. ఏలూరు జెడ్పీ ఛైర్పర్సన్ రేసులో మాగంటి బాబు సతీమణి, చింతమనేని కుమార్తె పోటీ పడుతున్నారు. ఇదే సీటును జనసేన ఆశిస్తోంది.

జనసేనకు దక్కే జెడ్పీ స్థానాలు - ఎవరు ఎక్కడ, లిస్టులో..!?
జనసేనకు దక్కే జెడ్పీ స్థానాలు - ఎవరు ఎక్కడ, లిస్టులో..!?
tdp-likely-to-pick-paritala-sriram-as-satyasai-dist-zp-chairperson-as-latest-discussions-in-the-par

సీఎం చంద్రబాబు కసరత్తు

కాగా.. పల్నాడు జిల్లా పరిషత్ చైర్మన్ రేసులో నందిగం శ్రీనివాసరావు, మాచర్ల నియోజకవర్గం శిరిగిరిపాడుకు చెందిన కుర్రి శివారెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మధ్య పోటీ నడుస్తోంది. కర్నూలు జెడ్పీ సీటు కోసం రుద్రఫణి, బొజ్జమ్మ పేర్లు తుది పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. నంద్యాల సీటు కోసం మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి సోదరుడు రాజారెడ్డి, సిరివెళ్ల మండల నేత శ్రీకాంత్ రెడ్డి మధ్య పోటీ నెలకొంది. అనకాపల్లి సీటు కోసం పలువురు టీడీపీ, జనసేన నేతలు పోటీ పడుతున్నారు. కాగా.. బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ తమ పార్టీకి ఈ సీటు కేటాయించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇక.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా సీటును గొల్లపల్లి సూర్యారావు కుమార్తె అమూల్య పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అదే విధంగా కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల స్థానాల కోసం సీనియర్లు తమ వారసుల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో.. చంద్రబాబు ఖరారు చేసే తుది జాబితా పైన పార్టీలో ఉత్కంఠ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+