పులివెందుల- కడప వైసీపీకి దక్కేనా, కీలక పరిణామాలు..!?
స్థానిక ఎన్నికల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో నామి నేషన్ల ప్రక్రియ పూర్తయింది. దాదాపు ఎనిమిది మున్సిపాల్టీలు ఏకగ్రీవం కావటం దాదాపు ఖాయం గా కనిపిస్తోంది. మాజీ సీఎం జగన్ సొంత జిల్లాతో పాటుగా పులివెందుల పైన టీడీపీ గురి పెట్టింది. జిల్లాలో పలు మున్సిపాల్టీలు ఏకగ్రీవం కానున్నాయి. అయితే, కడప కార్పోరేషన్ తో పాటుగా పులి వెందుల మున్సిపాల్టీలోనూ కీలక పరిణామాలు జరుగుతున్నాయి. దీంతో.. ఈ రెండు ఎవరికి దక్కుతాయనేది ఆసక్తిగా మారుతోంది.
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల వేళ కడప జిల్లా కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకోవటం తో రాజకీయంగా కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. జిల్లా కేంద్రం కడప కార్పోరేషన్ తో పాటుగా పులివెందుల మున్సిపాల్టీ ఫలితం పైన ఉత్కంఠ పెరుగుతోంది. జిల్లాలో ఎర్రగుంట్ల, మైదుకూరు, రాయచోటి పురపాలక సంఘాలు, గురజాల, కమలాపురం నగర పంచాయతీల్లో ఛైర్ పర్సన్ ఎన్నికలు కూటమి పార్టీలకు ఏకగ్రీవం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, పులివెందులలో మొత్తం 40 వార్డులు ఉన్నాయి. తొలిసారి ఇక్కడ టీడీపీ సుమారు 10 వరకు వార్డులు ఏకగ్రీవం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ మొత్తం 40 వార్డులు ఉండగా వైసీపీ నుంచి మొత్తం 30 నామినేషన్లు, టీడీపీ నుంచి 69 నామినేషన్లు దాఖలయ్యాయి. అదే విధంగా కమలాపురంలో 23 వార్డులున్నాయి. వైసీపీ నుంచి చైర్‌పర్సన్‌కు కానీ వార్డులకు కానీ ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.

జగన్ పులివెందుల పర్యటన వేళ
కాగా, మైదుకూరు మున్సిపాలిటీలో వైసీపీ నుంచి చైర్మన్ అభ్యర్థిగా ఎవరూ నామినేషన్ వేయలేదు. దీంతో ఇది కూడా టీడీపీకి ఏకగ్రీవమైనట్టేనని చెబుతున్నారు. అదేవిధంగా ఎర్రగుంట్ల చైర్‌పర్సన్ పదవిని బీజేపీకి కేటారుంచారు. ఇక్కడ తొలిరోజు ఒక వార్డుకు మాత్రమే వైసీపీ నామినేషన్ దాఖలు చేసింది. తర్వాత వైసీపీ నుంచి ఎవరూ నామినేషన్ వేయలేదు. దీంతో ఇది బీజేపీకి ఏకగ్రీవం కానుంది. అయితే.. పులివెందుల మున్సిపల్ ఛైర్ పర్సన్.. కడప కార్పోరేషన్ పదవి కోసం వైసీపీ అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేసారు. ఈ రోజున వారి నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఇక, 21వ తేదీ వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉంది. ఈ సారి మేయర్, మున్సిపల్ ఛైర్ పర్సన్ కు ప్రత్యక్ష ఎన్నిక కావటంతో.. ఈ రెండు పదవుల పైన వైసీపీ ఆశలు పెట్టుకుంది. కాగా.. తాజా సమీకరణాలు.. పరిణామాలతో టీడీపీ ఈ రెండు పదవుల పైన కొత్త వ్యూహాలు సిద్దం చేస్తోంది. 21న జగన్ పులివెందుల రానున్నారు. దీంతో.. జిల్లాలో ఈ రెండు సీట్లలో జరిగే పోలింగ్.. తుది ఫలితం పైన ఉత్కంఠ పెరుగుతోంది.













Click it and Unblock the Notifications
