అర కోటి దాటిన టిడిపి సభ్యత్వాలు: ఏకైక పార్టీ అని లోకేష్(పిక్చర్స్)
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో దూసుకుపోతోంది. అమెరికా సైన్యానికి మించిన సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను సమకూర్చుకుంది. శుక్రవారం సాయంత్రానికి పార్టీ సభ్యత్వం 54 లక్షలు దాటింది. కార్యకర్తల కోసం కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ చెప్పారు.
కాల్ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జనవరి 1 నుంచి కార్యకర్తలకు బీమా అమలులోకి వచ్చిందని, 24 గంటలూ 22 మంది సభ్యులతో ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకూ వారం పొడవునా ఒక ప్రత్యేక కేంద్రం పనిచేస్తుందని, వారు టెలిఫోన్‌లో కార్యకర్తల సమస్యలను విని వాటిని పరిష్కరిస్తారని లోకేష్ పేర్కొన్నారు.
త్వరలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడితో ‘ఆదరణ' సమావేశం జరుగుతుందని అపుడు మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం పొందిన కార్యకర్తలు కాల్ సెంటర్ నెంబర్ 7306299999కు ఫోన్ చేయవచ్చని చెప్పారు. నవంబర్ 3న పార్టీ సభ్యత్వం ప్రారంభించామని, అనూహ్యమైన స్పందన దక్కిందని అన్నారు. కార్యకర్తలకోసం కాల్ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చిన పార్టీలు ఇంతవరకూ ఎక్కడా లేవని అన్నారు.
పార్టీ సభ్యత్వం 25 లక్షలు చేద్దామనుకుంటే అది 30 లక్షలకు, 40 లక్షలకు పెరిగి నేటికి 54 లక్షలకు చేరుకుందని చెప్పారు. తొలుత పార్టీ సభ్యత్వ కార్డులు 25 లక్షలు మాత్రమే ప్రింట్ చేశామని, ప్రతి కార్యకర్తకూ తమ సభ్యత్వ కార్డును అందజేసే బాధ్యతను పార్టీ తీసుకుంటుందని అన్నారు. పార్టీ సభ్యత్వం కార్డు వెనుక భాగంలో హెల్ప్‌లైన్ సెంటర్ ఉంటుందని చెప్పారు. ఈ నెంబర్‌కు ఫోన్ చేసిన వెంటనే అన్ని విధాలా సమాధానం లభిస్తుందని పేర్కొన్నారు.

కాల్ సెంటర్ ప్రారంభిస్తూ..
తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో దూసుకుపోతోంది. అమెరికా సైన్యానికి మించిన సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను సమకూర్చుకుంది.

లోకేష్
శుక్రవారం సాయంత్రానికి పార్టీ సభ్యత్వం 54 లక్షలు దాటింది. కార్యకర్తల కోసం కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ చెప్పారు.

లోకేష్
కాల్ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

లోకేష్
జనవరి 1 నుంచి కార్యకర్తలకు బీమా అమలులోకి వచ్చిందని, 24 గంటలూ 22 మంది సభ్యులతో ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకూ వారం పొడవునా ఒక ప్రత్యేక కేంద్రం పనిచేస్తుందని, వారు టెలిఫోన్‌లో కార్యకర్తల సమస్యలను విని వాటిని పరిష్కరిస్తారని లోకేష్ పేర్కొన్నారు.

లోకేష్
త్వరలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడితో ‘ఆదరణ' సమావేశం జరుగుతుందని అపుడు మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

లోకేష్
తెలుగుదేశం పార్టీ సభ్యత్వం పొందిన కార్యకర్తలు కాల్ సెంటర్ నెంబర్ 7306299999కు ఫోన్ చేయవచ్చని చెప్పారు.

లోకేష్
నవంబర్ 3న పార్టీ సభ్యత్వం ప్రారంభించామని, అనూహ్యమైన స్పందన దక్కిందని అన్నారు.

లోకేష్
కార్యకర్తలకోసం కాల్ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చిన పార్టీలు ఇంతవరకూ ఎక్కడా లేవని అన్నారు.

లోకేష్
పార్టీ సభ్యత్వం 25 లక్షలు చేద్దామనుకుంటే అది 30 లక్షలకు, 40 లక్షలకు పెరిగి నేటికి 54 లక్షలకు చేరుకుందని చెప్పారు. తొలుత పార్టీ సభ్యత్వ కార్డులు 25 లక్షలు మాత్రమే ప్రింట్ చేశామని, ప్రతి కార్యకర్తకూ తమ సభ్యత్వ కార్డును అందజేసే బాధ్యతను పార్టీ తీసుకుంటుందని అన్నారు.
కాల్ సెంటర్ బాధ్యతగా తీసుకుని సమస్య పరిష్కారానికి చొరవ చూపుతుందని అన్నారు. జనవరి 1వ తేదీ నుండి కార్యకర్తల బీమా అమలులోకి వచ్చిందని అన్నారు, తెలంగాణ రాష్ట్రంలో జనవరి 1వ తేదీన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరణించారని, వారికి బీమా సౌకర్యం వర్తిస్తుందని లోకేష్ చెప్పారు. 10 రోజుల్లో బీమా సొమ్మును వారి కుటుంబ సభ్యులకు అందజేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications