ఏపీ మంత్రికి అస్వస్థత: హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు..
ఉదయం నుంచి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో చికిత్స నిమిత్తం ఆయనను ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది.
తిరుపతి: ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు తిరుపతిలో అస్వస్థతకు గురయ్యారు. మనువడి పుట్టు వెంట్రుకలు తీసే కార్యక్రమానికి హాజరైన ఆయన.. శ్వాసకోశ సమస్యతో ఇబ్బందిపడ్డారు. దీంతో హుటాహుటిన ఆయనను రుయా ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం డాక్టర్లు ఆయనకు చికిత్స ప్రారంభించారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, మనువడి పుట్టెంట్రుకలు తీసే కార్యక్రమం కోసం కుటుంబ సభ్యులతో కలిసి గురువారం నాడు అయ్యన్నపాత్రుడు తిరుపతికి వచ్చారు. అయితే ఉదయం నుంచి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో చికిత్స నిమిత్తం ఆయనను ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన బాగానే కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications