ఎంత మంది ప్రశాంత్ కిశోర్‌లను తెచ్చుకున్నా...: జగన్‌పై మంత్రుల ఎదురుదాడి
తన వ్యూహాలకు, కార్యాచరణకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పదును పెడుతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ అప్రమత్తమైంది. జగన్‌పై ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఎదురుదాడికి దిగుతున్నారు.
విజయవాడ: తన వ్యూహాలకు, కార్యాచరణకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పదును పెడుతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ అప్రమత్తమైంది. జగన్‌పై ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఎదురుదాడికి దిగుతున్నారు.
మంత్రులు దేవినేని ఉమా మహేశ్వర రావు, చిన రాజప్ప, ఆదినారాయణ రెడ్డి జగన్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల వ్యూహరచన కోసం జగన్ ప్రశాంత్ కిశోర్‌ను నియమించుకున్న విషయం తెలిసిందే. దానిపై కూడా మంత్రులు వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర రాజకీయాలను జగన్ భ్రష్టు పట్టిస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. కాపు నేత ముద్రగడ పద్మనాభం, ఎమ్మార్పీయస్ నేత మందకృష్ణ మాదిగ ఉద్యమాలకు కూడా వారు జగన్‌నే తప్పు పడుతున్నారు.

ఎంత మంది ప్రశాంత్ కిశోర్‌లను తెచ్చుకున్నా....
జగన్ ఎంతమంది ప్రశాంత్ కిషోర్‌లను తెచ్చుకున్నా ఏమీ కాదని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన పాపాలకు ఎంతో మంది ఐఏఎస్ అధికారులు బలయ్యారని ఆయన నిందించారు.కుల, మతాల పేరుతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్ర రాజకీయాలను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన అన్నారు. ఎర్రచందనం దొంగలను జైల్లో పెడుతుంటే ప్రభుత్వంపై విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు చెడగొట్టాలని జగన్ కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తూ కుట్రలు, కుతంత్రాలను ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు.

సిఎం కుర్చీపైనే యావ....
జగన్ యావంతా ముఖ్యమంత్రి కుర్చీపైనేనని, అది జరిగే పని కాదని మంత్రి ఆదినారాయణ రెడ్డి కర్నూలు జిల్లా నంద్యాలలో అన్నారు. ముఖ్యమంత్రిగా ఐదు సార్లు ఎన్నిక అవుతాడట, 30 ఏళ్లు పాలన చేస్తాడట, దొంగ సొమ్ము ఉందనే తల బిరుసుతో అభివృద్ధి చేస్తున్న సీఎం చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. సాక్షి పత్రికను అడ్డుపెట్టుకొని ప్రభుత్వంపై తప్పుడు వార్తలు రాయిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. నంద్యాల ఎమ్మెల్యేగా భూమా నాగిరెడ్డి ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతిపాదించిన పనులకు నిధులు మంజూరయ్యాయని, ఉప ఎన్నికలకు దృష్టిలో పెట్టుకొని నిధులు మంజూరు చేయలేదని ఆయన చెప్పారు.
Recommended Video


గుణపాఠం చెప్తాం....
నంద్యాల ఉప ఎన్నికల్లో బ్రహ్మానందరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలకు గుణపాఠం చెప్తామని మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. అభివృద్ధి కోసం ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి గెలుపు అవసరమని, టీడీపీ కోసం కాదని మరో మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఓడినా, గెలిచినా ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదని, నియోజకవర్గ ప్రజలకు నష్టం జరుగుతుందని అన్నారు. స్వలాభం కోసమే జగన్ పార్టీని నిర్వహిస్తున్నారని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, మంత్రి కిమిడి కళావెంకట్రావు పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో విమర్శించారు. డొల్ల కంపెనీలు పెట్టేజగన్ లాంటివారికి జీఎస్టీ ఒక హెచ్చరిక అని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు రాజమహేంద్రవరంలో అన్నారు.

కులాల మధ్య చిచ్చు...
రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తుంటే జగన్ కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు చూస్తున్నారని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ముద్రగడ పద్మనాభం, మందకృష్ణమాదిగ వెనుక జగన్ ఉన్నారని ఆయన గురువారం అమరావతిలో ఆరోపించారు. ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా సభలు, సమావేశాలు నిర్వహిస్తామంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి












Click it and Unblock the Notifications