లం** కొడుకు అంటూ ఎన్టీఆర్‌పై బూతులతో రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌పై విమర్శలు పెరుగుతున్నాయి. తాజాగా, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్‌ను అత్యంత దారుణంగా దూషించిన ఆడియో ఒకటి బయటకు వచ్చి తీవ్ర కలకలం సృష్టించింది. ఆ ఆడియోలో ఎమ్మెల్యే దగ్గుబాటి, ఎన్టీఆర్‌ను "లం** కొడుకు" అంటూ బూతులు తిడుతూ, ఆయన తాజా చిత్రం 'వార్ 2' షోలను అనంతపురంలో నిలిపివేయాలని హెచ్చరించారు.

ఈ ఘటనతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రజా ప్రతినిధి ఇంత అసభ్యకరమైన భాషను వాడటంపై వారు నిరసన తెలుపుతున్నారు. ఎన్టీఆర్ సినిమా ప్రదర్శనలను అడ్డుకోవడంపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలు కేవలం వ్యక్తిగత ద్వేషం కాదని, రాజకీయ కక్ష సాధింపులో భాగమని అభిమానులు ఆరోపిస్తున్నారు.

TDP MLA Abuses Jr NTR Demands War 2 Movie to be Stopped

నందమూరి కుటుంబానికి, ముఖ్యంగా నారా చంద్రబాబు కుటుంబానికి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారని, ఏ పండుగలకు కూడా హాజరు కావడం లేదని ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో, అధికార కూటమిలో ఉన్న ఒక ఎమ్మెల్యే బహిరంగంగా ఎన్టీఆర్‌పై దాడి చేయడం ఆసక్తికరంగా మారింది. కూటమి ప్రభుత్వం అండదండలతోనే ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ ఇంత ధైర్యంగా రెచ్చిపోయారని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆరోపిస్తున్నారు.

ఎమ్మెల్యే వివరణ
ఈ ఘటనపై ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు.జూనియర్ ఎన్టీఆర్‌ను తాను దూషించాననే ఆరోపణలను ఆయన ఖండించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో కాల్ తనది కాదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.ఇది రాజకీయ కుట్రలో భాగమని ఆరోపించారు. గత 16 నెలలుగా అర్బన్ నియోజకవర్గంలో తనపై కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.తాను మొదటి నుంచి నందమూరి కుటుంబ అభిమానినని, కాబట్టి ఆడియో అబద్ధమని అన్నారు.ఈ విషయమై ఇప్పటికే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానని తెలిపారు.

ఈ వ్యవహారం రాజకీయంగా, సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై టీడీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో, అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+