కారు డ్రైవర్ నిర్వాకంతో మరోసారి వివాదంలో చిక్కుకున్న టిడిపి ఎమ్మెల్యే అనిత
అమరావతి:పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత మరోసారి వార్తల్లో కెక్కారు. అయితే ఈసారి ఆమె నేరుగా ఏ వివాదంలో చిక్కుకోకున్నా ఆమె కారు డ్రైవర్ నిర్వాకం కారణంగా ఆమె పేరు తెర మీదకు వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే?...
తన బంధువుల వ్యక్తికి ఎలాగైనా ఉద్యోగం ఇప్పించుకోవాలనే ఆరాటంతో ఏకంగా ఒక సీనియర్ మంత్రి పేరిటే నకిలీ సిఫార్సు లేఖ తయారు చేసేశాడు సదరు డ్రైవర్. అయితే ఆ లేఖ తీరుతెన్నులపై అనుమానం వచ్చిన సంబంధిత శాఖ మంత్రి(ఈయన కూడా సీనియరే) నేరుగా సదరు మంత్రినే రికమండేషన్ గురించి అడిగేశారు. ఈ క్రమంలో కారు డ్రైవర్ నిర్వాకం బైటపడింది. ఇదంతా బానే ఉన్న ఇప్పుడు ఆ కారుడ్రైవర్ మీద కేసు పెట్టొద్దని ఎమ్మెల్యే అనిత ఒత్తిడి తేవడమే ఆమె పేరు కూడా బైటకు రావడానికి కారణమని అంటున్నారు. వివరాల్లోకి వెళితే...

సంచలన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే టిడిపి ఎమ్మెల్యే వంగలపూడి అనిత కారు డ్రైవర్ అఖిల్ నిర్వాకం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కారణం తాను ఒక ఎమ్మెల్యేకి కారు డ్రైవర్ అయి ఉండి బంధువుల అబ్బాయికి ఉద్యోగం కోసం ఒక ఫోర్జరీ లేఖ సృష్టించి దాంతో ఏకంగా ఒకేసారి ఇద్దరు సీనియర్ మోస్ట్ మంత్రులను మోసం చేయబోయాడు. ఇంత నిర్భయంగా అతడు మంత్రులను మోసం చేసేందుకు పూనుకోవడం టిడిపిలోనూ చర్చనీయాంశంగా మారింది.
ఈ వ్యక్తికి షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగం ఇవ్వాలంటూ ఆర్ధిక శాఖామంత్రి యనమల రామకృష్ణుడు సిఫార్సు చేస్తున్నట్లుగా విద్యుత్ శాఖా మంత్రి కళా వెంకటరావుకు నకిలీ రికమండేషన్ లెటర్ రాసేశాడు. అయితే ఆ లెటర్ తీరుతెన్నులు చూసిన మంత్రి కళా వెంకటరావు ఆలస్యం చేయకుండా వెంటనే మంత్రి యనమల దృష్టికి విషయం తీసుకువెళ్లి మీరు ఏమైనా సిఫార్స్ లేఖ పంపారా?...అని అడిగితే ఆయన లేదన్నారు. దీంతో ఈ వ్యవహారం మొత్తం తీగ లాగితే డొంక ఎమ్మెల్యే అనిత కారు డ్రైవర్ అఖిల్ వద్ద తేలింది.
ఎమ్మెల్యే డ్రైవర్ అయివుండి సాక్షాత్తూ ఇద్దరు సీనియర్ మంత్రలనే బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించిన అఖిల్ పై మండిపడిన మంత్రి కళా వెంకటరావు ఈ నకిలీ లేఖపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు డ్రైవర్ అఖిల్ ను అదుపులోకి తీసుకున్నారట. అయితే ఆ తరువాత సీను లోకి ఎంటర్ అయిన ఎమ్మెల్యే అనిత అతనిపై తొందరపడి కేసు నమోదుచేయొద్దని...నేను వివాదం సమసిపోయేలా చూస్తానని పోలీసులపై ఒత్తిడి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు పోలీసులు కూడా తమకు నకిలీ లేఖపై ఏ ఫిర్యాదు అందలేదు అని చెబుతుండటం గమనార్హం. చివరకు ఈ వ్యవహారం ఎలా సర్దుబాటు అయినా ఎమ్మెల్యే అనిత పేరు మాత్రం ఈ వివాదంతో మరోసారి వార్తల్లోకెక్కేసింది.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications