చంద్రబాబుకు షాక్: పవన్ కల్యాణ్‌తో బడేటి భేటి, జనసేనలోకి...

ఏలూరు: తెలుగుదేశం శాసనసభ్యుడు బడేటి బుజ్జి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి షాక్ ఇవ్వబోతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయన జనసేనలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

గురువారం రాత్రి బడేటి బుజ్జి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో ఏకాంతంగా సమావేశమయ్యారు. గురువారం రాత్రి పపన్ కల్యాణ్ జనసేన పార్టీ కోశాధికారి రాఘవయ్య నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులను కలిశారు.

 వివాహానికి రాలేకపోవడంతో...

వివాహానికి రాలేకపోవడంతో...

రాఘవ్య తల్లిని పరామర్శించిన పవన్ కల్యాణ్ ఇటీవల వివాహమైన బడేటి బుజ్జి కూతురును, అల్లుడిని ఆశీర్వదించారు. బుజ్జి అల్లుడికి రాఘవయ్య సమీపం బంధువు. దానివల్ల పవన్ కల్యాణ్ వివాహానికి హాజరు కావాల్సి ఉంది. అయితే, అది కుదరకపోవడంతో గురువారం వారిని కలిసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగానే పవన్ కల్యాణ్‌తో బుజ్జి ఏకాంత భేటీ జరిపారు.

 బుజ్జిపై చంద్రబాబు ఇలా...

బుజ్జిపై చంద్రబాబు ఇలా...

గతంలో ప్రజారాజ్యం పార్టీలో ఉన్న బుజ్జి తెలుగుదేశంలోకి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో బుజ్జికి చంద్రబాబు సీటు ఇచ్చే అవకాశం లేదనే ప్రచారం సాగుతోంది. బుజ్జి గెలిచిన తర్వా ఏలూరులో రౌడీ రాజకీయాలు, హత్యలు, భూకబ్జాలు పెరిగాయని చంద్రబాబు భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో బుజ్జికి వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వకూడదని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

 ఒకవేళ టిడిపి టికెట్ రాకపోతే...

ఒకవేళ టిడిపి టికెట్ రాకపోతే...

వచ్చే ఎన్నికల్లో తనకు టీడిపి టికెట్ రాకపోతే జనసేన నుంచి తనకు గానీ, తన అల్లుడికి గానీ పోటీ చేసే అవకాశం ఇవ్వాలని బుజ్జి పవన్ కల్యాణ్‌ను కోరినట్లు చెబుతున్నారు. అల్లుడిని ముందుకు తెచ్చేందుకు బుజ్జి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరమైతే జనసేన తరఫున అల్లుడిని ముందుకు తీసుకురావాలని బుజ్జి ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.

 పవన్ కల్యాణ్ టిడిపి నేతలను ఎందుకు కలిశారు...

పవన్ కల్యాణ్ టిడిపి నేతలను ఎందుకు కలిశారు...

ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినందున ఏలూరులో జనసేన కార్యకర్తలను, తన అభిమానులను కలవడం లేదని పవన్ కల్యాణ్ చెప్పారు. అయితే, తెలుగుదేశం పార్టీ నాయకులను ఎందుకు కలిశారని ఆయనను ప్రశ్నిస్తున్నారు. దానివల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+