పవన్ కి రాజకీయాలు సరి కావు...అభిమానిగా చెబుతున్నా:ఎమ్మెల్సీ సూర్యారావు;తప్పుడు ఆరోపణలు: బడేటి బుజ్జి
పశ్చిమ గోదావరి:జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై చేసిన వ్యాఖ్యలపై ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి తీవ్రంగా ప్రతిస్పందించారు. తాను ప్రజల కోసం పనిచేసే మనిషినని...ఎవరికీ భయపడనని బడేటి బుజ్జి చెప్పుకొచ్చారు.
తనపై పవన్ కళ్యాణ్ నిరాధార ఆరోపణలు చేశారని, తానెక్కడా...ఎప్పుడూ కబ్జాలు చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పేకాట క్లబ్బులంటూ పవన్ తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఏలూరులో హత్యలు జరుగుతున్న మాటలు వాస్తవం, కానీ వాటి నిరోధానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ఎమ్మెల్సీ ఆర్.సూర్యారావు మాట్లాడుతూ రాజకీయాలు పవన్ కు సరికావని అన్నారు.

గతంలోనూ...నిరాధార ఆరోపణలు
శుక్రవారం ఏలూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ...తనపై చేసిన విమర్శలను పవన్ కల్యాణ్ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని... రెండ్రోజులు టైమ్ ఇస్తున్నానని...ఈలోగా పవన్ తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బడేటి బుజ్జి సవాల్ చేశారు. పవన్ తనపై నిరాధార ఆరోపణలు చేశారని...గతంలోనూ ఇలాగే లోకేష్ కు, శేఖర్ రెడ్డి లకు సంబంధాలు ఉన్నాయని నిరాధార ఆరోపణలే చేశారని వ్యాఖ్యానించారు.

చింతమనేని...నా స్నేహితుడు
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అంటే తనకు భయం లేదని, ఆయన 40ఏళ్లుగా తనకు స్నేహితుడన్న సంగతి ఈ ప్రాంత వాసులు అందరికీ తెలుసన్నారు. ఆయన ఏలూరులో ఒక్క నేరం చేయలేదన్నారు. పవన్ చేసే తప్పుడు ఆరోపణలకు తాను భయపడనని...అలా భయపడే తత్వం తన రక్తంలో లేదన్నారు. స్కూలు భూములు కబ్జా చేసానని పవన్ అంటున్నారు...అలా అని ఆధారాలతో సహ నిరూపించగలరా అని పవన్ ను ప్రశ్నించారు. ఏలూరులో తన హయాంలో ఎటువంటి పేకాట క్లబ్బులు రాలేదన్నారు. ఉన్న ఒక్క టౌన్ హాల్ కొంతమంది పెద్దలు చాలాకాలం క్రితం ఏర్పాటు చేసుకున్నారని బడేటి బుజ్జి చెప్పుకొచ్చారు.

రాజకీయాలు...పవన్ కు సరికావు
ఇదిలావుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ఎమ్మెల్సీ ఆర్.సూర్యారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఏలూరులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవన్ తీరు చూస్తుంటే...ఆయన రాజకీయాల్లోకి రావడం మంచిది కాదేమో అనిపిస్తుందని అన్నారు. పవన్ ప్రజలకు సేవ చేయాలనుకుంటే ఆయనకు రాజకీయాలు సరికావని...ఈ విషయాన్ని పవన్ అభిమానిగా, శ్రేయోభిలాషిగా చెబుతున్నానని చెప్పుకొచ్చారు.

చింతమనేని...ప్రజా సేవ
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన శిష్యుడని, ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నాడని, కోపంలో ఏమైనా తప్పులు చేసి ఉండవచ్చని...కానీ వాటిని ఎత్తిచూపుతూ తప్పుపట్టడం మంచిది కాదని పవన్ కళ్యాణ్ కు ఎమ్మెల్సీ ఆర్.సూర్యారావు హితవు పలికారు. పవన్...లోకేష్, జడ్పీ చైర్మన్ బాపిరాజు, ఎమ్మెల్యే బడేటి బుజ్జిపై ఆధారం లేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆధారాలు నిరూపించాలని పవన్ కు సవాల్ విసిరినా అతడు సమాధానం చెప్పడని...ఈ తీరుపై పవన్ ఆలోచించుకోవాలని ఆయన కోరారు.
-
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీలో శ్రీలీల పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..? -
అన్న మళ్లీ హిట్ కొట్టాడోచ్.. పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ రివ్యూ..! -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
Pawan kalyan vs Ranveer Singh:ఉస్తాద్ వర్సెస్ ధురందర్..హ్యాట్రిక్ పోరులో గెలుపెవరిది? -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే!












Click it and Unblock the Notifications