జగన్ కు అధికారం దూరం అయినా బుద్దిమారలేదు, టైమ్ పాస్ చేస్తున్నాడు, పరిటాల

వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డికి అధికారం దూరం అయినా ఆయన దుష్ట చర్యలు మానుకోవడం లేదని, ఇప్పటికి తానే రాజు, రారాజు అనుకోని విర్రవీగుతున్నారని మాజీ మంత్రి, రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు అన్ని ఇన్ని కావని, చెప్పుకుంటూ పోతే జగన్ గురించి చరిత్ర రాయవచ్చు అని టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ఆరోపించారు.

అయితే కూటమి ప్రభుత్వంపై జగన్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజల గమనిస్తున్నారని, ఆయన ఎన్ని మాయ మాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత వ్యవంగంగా అన్నారు. ప్రజల సమస్యల గురించి ఆలోచించకుండా మాజీ సీఎం జగన్ కుళ్లు రాజకీయాలు చేస్తున్నారని, ప్రజలు చీకొట్టి 11 సీట్లకే పరిమితం చేసినా వైసీపీ నాయకులు మాత్రం భుజాలు గుద్దుకుంటున్నారని పరిటాల సునీత ఎద్దేవ చేశారు.

TDP MLA Paritala Sunitha is furious with former CM YS Jagan

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో 36 హత్యలు జరిగాయని ఢిల్లీకి వెళ్లిన జగన్ అక్కడ తప్పుడు ప్రచారం చేశారని, ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ కూడా చేశారని, హత్యలకు గురైన ఆ 36 మంది లిస్టు ఇవ్వాలని జాతీయ మీడియా అడిగితే జగన్ చిన్నగా అక్కడి నుంచి జారుకున్నారని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో రాప్తాడు లో జరిగిన అరాచకాలు మరెక్కడా జరగలేదని, అందుకు సాక్ష్యం మేమే అని పరిటాల సునిత అన్నారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రశాంత వాతావరణం ఉందని పరిటాల సునీత అన్నారు. అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలపై పోరాటం చేయాల్సిన జగన్ బెంగళూరు, ఢిల్లీ, తాడేపల్లిగూడెం తిరుక్కుంటూ టైమ్ పాస్ చేస్తున్నారని, అసెంబ్లీలోకి వచ్చి ప్రభుత్వం అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక జగన్ తప్పించుకుని తిరుగుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ఆరోపించారు.

వైసీపీ ప్రభుత్వంలో రాప్తాడు లో టీడీపీ కార్యకర్తలను నానా ఇబ్బందులకు గురి చేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు వేదాంతం మాట్లాడుతున్నారని, వీరి మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మాజీమంత్రి. అనంతపురం జిల్లాలోని రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటా సునీత మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో తప్పుడు పనులు చేసిన వైసీపీ నాయకులు త్వరలో మూల్యం చెల్లించుకుంటారని, వారికి రోజులు దగ్గర పడ్డాయని పరిటాల సునిత అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+