అందుకే నీ అమ్మా, అబ్బా అంటున్నారు.. తల నరుక్కుంటా: జేసీపై ప్రభాకర్

అనంతపురం: జిల్లా తెలుగుదేశం పార్టీలో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పైన ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జేసీకి వయస్సు మీద పడిందని కానీ బుద్ధి రాలేదన్నారు. జేసీకి సభ్యత, సంస్కారం లేవన్నారు. అందుకే నీ అమ్మా.. అబ్బా అంటూ తిడుతున్నారని మండిపడ్డారు. జిల్లాలో ఆయన బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారన్నారు.

జేసీకి దమ్ముంటే, ధైర్యం ఉంటే తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపించాలని ప్రభాకర్ చౌదరి సవాల్ చేశారు. జేసీ అవినీతిలో పీహెచ్‌డీ చేశారన్నారు. అనంతపురం జిల్లా అభివృద్ధికి జేసీనే అడ్డు పడుతున్నారని ఆరోపించారు. తాను ఏ తప్పు చేయలేదని, గన్ మెన్లు లేకుండా తాను తిరిగేందుకు సిద్ధమని, మీరు సిద్ధమా అన్నారు.

సహనానికి హద్దు ఉంటుంది

సహనానికి హద్దు ఉంటుంది

తన సహనానికి కూడా హద్దు ఉంటుందని ప్రభాకర్ చౌదరి అన్నారు. తన సహనాన్ని పరీక్షించవద్దని, ఖబడ్దార్ అని జేసీని హెచ్చరించారు. జేసీ ఆగడాలకు వ్యతిరేకంగా తాను పోరాటం చేస్తానని చెప్పారు. ఆయన తాటాకు చప్పుళ్లకు తాను భయపడేది లేదన్నారు. జేసీ తీరు దొంగే దొంగ అన్నట్లుగా ఉందన్నారు.

మానసిక పరిస్థితిపై అనుమానాలు

మానసిక పరిస్థితిపై అనుమానాలు

అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డి దౌర్జన్యాలను సహించేది లేదని ప్రభాకర్ చౌదరి తేల్చి చెప్పారు. ఆయన మానసిక పరిస్థితిపై అనుమానాలు ఉన్నాయని చెప్పారు. తాము అంతా కలిసి జేసీని గెలిపిస్తే ఆయన మాత్రం మమ్మల్నే బెదిరిస్తున్నారన్నారు. జేసీ వల్ల టీడీపీకి నష్టమే తప్ప, లాభం లేదన్నారు. తనపై అవినీతి ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు. అధికారులను బెదిరిస్తున్నారన్నారు. అవినీతిని నిరూపిస్తే తల నరుక్కుంటానని చెప్పారు.

 అంతకుముందు, ప్రభాకర్ చౌదరిపై జేసీ ఆగ్రహం

అంతకుముందు, ప్రభాకర్ చౌదరిపై జేసీ ఆగ్రహం

కాగా, అంతకుముందు రోజు జేసీ దివాకర్ రెడ్డి.. ప్రభాకర్ చౌదరిపై విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే, మేయర్‌ల వల్ల టీడీపీకి, చంద్రబాబుకు చెడ్డపేరు వస్తోందని ధ్వజమెత్తారు. నాలుగేళ్లలో నగరంలో జరిగిన అభివృద్ధి శూన్యమని, అంతా అవినీతి, అక్రమాలే అన్నారు. కోర్టు రోడ్డులోని చారిత్రాత్మక భవనం పీస్‌ మెమోరియల్‌ హాల్‌ ఆధునికీకరణపై అనేక విమర్శలు వస్తున్నాయన్నారు.

 చంద్రబాబుకు చెప్తానని

చంద్రబాబుకు చెప్తానని

పురాతన భవన స్థలాలను అద్దెకు ఇచ్చుకున్నారని, ఇందులో ఎవరెవరికీ ఎంత వాటాలున్నాయో చెప్పాలని జేసీ డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై జాయింట్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. వారి అక్రమాలతో పార్టీకి, చంద్రబాబుకు చెడ్డపేరు వస్తోందని, ఈ విషయాన్ని అధినేత దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు. దీనిపై ప్రభాకర్ చౌదరి మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+