వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్‌కు రేవంత్ బుక్కయ్యాడు!: టీడీపీ ఆవేదన, అలా దొరికిపోయాడా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎరకు తమ పార్టీ నేత రేవంత్ రెడ్డి చిక్కాడాని తెలంగాణ టీడీపీ సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. డీల్ విషయంలో అనుమానించాల్సింది పోయి అడ్డంగా దొరికిపోయాడని ఆందోళన చెందుతున్నారని అంటున్నారు.

చాలామందికి పేరు కూడా తెలియని నామినేటెడ్‌ ఎమ్మెల్యే వద్దకు రేవంత్‌ రెడ్డి వంటి స్థాయి ఉన్న నేత ఎందుకు వెళ్లారు? రేవంత్‌ ఇరుక్కుపోయారా? తెలంగాణ సీఎం కేసీఆర్‌ విసిరిన ఎరకు చిక్కిపోయారా? ఈ ప్రశ్నలకు టీడీపీ వర్గాలు ఔననే సమధానమిస్తున్నాయంటున్నారు.

TDP MLA Revanth Reddy caught bribing

రేవంత్‌పై తెరాస సర్కార్‌ ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సింది పోయి ఏమాత్రం ఆలోచన లేకుండా దొరికిపోయారని పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కొన్నాళ్లుగా నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌ నుంచి టీడీపీ నేతలకు కొన్ని సంకేతాలు అందాయని అంటున్నారు. తెరాస ఆకర్ష్‌ నేపథ్యంలో ఒత్తిడిలో ఉన్న టీ-టీడీపీ నేతలు ఆయనను సంప్రదించే ప్రయత్నం చేశారు.

కానీ, రేవంత్‌ రెడ్డి వస్తేనే తాను మాట్లాడతానంటూ, మరెవరితోనూ మాట్లాడబోనని స్టీఫెన్‌ స్పష్టం చేశారని వార్తలు వచ్చాయి. రెండు రోజులపాటు ఈ తర్జనభర్జనలు సాగాయి. చివరికి స్టీఫెన్‌ను కలవాలనే రేవంత్‌ నిర్ణయించుకున్నారు.

అయితే, ఏదైనా హోటల్‌లో కానీ ఫార్మ్‌ హౌస్‌లో కానీ భేటీ కాకుండా నేరుగా స్టీఫెన్‌ ఇంట్లోనే ఆయన్ను కలిసే సాహసం చేశారని అంటున్నారు. పక్కా ప్రణాళికతో ఇంటినిండా నిఘా కెమెరాలతో సిద్ధంగా ఉన్న స్టీఫెన్‌ పక్కా ఆధారాలతో రేవంత్‌ను బిగించేశారని అంటున్నారు. కేసీఆర్‌ విసిరిన ఎరకు రేవంత్‌ చిక్కుకుపోయారని అంటున్నారు.

English summary
The election to the Telangana Legislative Council from the Assembly constituency, on Monday, took an ugly turn on Sunday evening with sleuths of the Anti-Corruption Bureau arresting Telugu Desam MLA A. Revanth Reddy on the charge of trying to bribe a nominated member of the Assembly representing the Anglo-Indian community, Elvis Stephenson.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X