వీధిలో టిడిపి ఎమ్మెల్యే కుమారుడి బర్త్‌డే‌, హంగామా

విజయవాడ: తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వర రావు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన కుమారుడు రవితేజ విజయవాడలో రద్దీగా ఉండే వీధుల్లో తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు.

రవి అతి వేగంతో ఎస్‌యువిని నడుపుతుండగా, అతని అనుచురులు బయటకు చేతులు పెట్టి ఊపుతూ ఉన్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. అతి వేగంతో దూసుకుపోతున్న వాహనాన్ని చూసి ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు.

TDP MLA's son celebrates birthday on Viajaywada streets, creates ruckus

దారుల పక్కన ప్రజలు బిత్తరపోయి వారివైపే చూడడం కనిపించింది. రవితేజ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని మిత్రులు రోడ్డు మధ్యలో బాణసంచా పేలుస్తూ హంగామా చేశారు.

పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. రవి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం ఇదే తొలిసారి కాదు. గతంలో బైక్ రేసింగ్ విషయంలోనూ అతనిపై ఆరోపణలు వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+