నోరు అదుపులో పెట్టుకో...పిచ్చికుక్కలాగా:కొడాలి నానీకి వల్లభనేని వంశీ వార్నింగ్
విజయవాడ:గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గుడివాడ వైసిపి ఎమ్మెల్యే, ఒకనాటి తన ఆప్తమిత్రుడు అయిన కొడాలి నానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని కొడాలి నానిని ఉద్దేశించి వల్లభనేని వంశీ హెచ్చరించారు.
నానీ నేను ఒకప్పుడు స్నేహితులమే కానీ ఇప్పుడు కాదన్నారు వంశీ. వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర సందర్భంగా కొడాలి నాని టీడీపీ అధినేత,ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీద ఫైర్ అయిన సంగతి తెల్సిందే. కొడాలి నానీ విమర్శలపై స్పందించిన వంశీ...జగన్ పాదయాత్ర సందర్భంగా కొడాలి నానీ మాట్లాడుతూ తామిద్దరం మంచి స్నేహితులమని అంటూనే చంద్రబాబును తిడుతున్నారని అన్నారు.

చంద్రబాబును తిడితే తాను సహించేది లేదని వంశీ హెచ్చరించారు. ఇప్పుడు అసలు కొడాలి నానితో తనకు స్నేహమే లేదన్నారు వంశీ. ఇలా పిచ్చికుక్కలా మాట్లాడే వారిని కంట్రోల్ చేయకపోతే జగన్ కు కూడా ఇబ్బందులు తప్పవని వంశీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications