జగన్ కేంద్రానికి కోవర్ట్, సోము వీర్రాజు వైసీపీ ఏజంట్, రాష్ట్రాన్ని పడగొట్టాలని చూస్తున్నారు: బుద్దా

అమరావతి: బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌కు ఏజంట్‌గా మాట్లాడుతున్నాడని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. రాష్ట్రాన్ని పడగొట్టాలని భావించే వారికి వైఎస్ జగన్, సోము వీర్రాజులు సహకరిస్తున్నారని బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన వారికి మద్దతిస్తున్నారని వెంకన్న విమర్శలు గుప్పించారు.

Recommended Video

    BJP Leader Fires At TDP And Congress

    టిడిపి, బిజెపి నేతల మధ్య మాటల యుద్దం సాగుతూనే ఉంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గురువారం నాడు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు శుక్రవారం నాడు ఏపీ సీఎంపై నిప్పులు చెరిగారు.

    బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోము వీర్రాజును జగన్ ఏజంట్‌గా బుద్దా వెంకన్న పేర్కొన్నారు.ఏపీకి జరిగిన అన్యాయం విషయంలో తమతో కలిసి పోరాటం చేసేందుకు రావాలని బుద్దా వెంకన్న బిజెపి నేతలకు సూచించారు.

     సోము వీర్రాజు వైఎస్ జగన్ ఏజంట్

    సోము వీర్రాజు వైఎస్ జగన్ ఏజంట్

    బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు వైఎస్ జగన్ ఏజంట్‌గా వ్యవహరిస్తున్నాడని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. ప్రత్యేక హోదానా, ప్రత్యేక ప్యాకేజీనా అనేది ముఖ్యం కాదు, ఏపీకి న్యాయం జరగాలనేదే తమకు ముఖ్యమని బుద్దా వెంకన్న చెప్పారు. చంద్రబాబునాయుడు ఏపీ రాష్ట్రానికి న్యాయం జరగాలని మాట్లాడుతున్నారని వెంకన్న చెప్పారు.వైసీపీ అధినేత వైఎస్ జగన్ డైరెక్షన్‌లో బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు పనిచేస్తున్నారని బుద్దా వెంకన్న ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి వైసీపీ అధినేత జగన్ కోవర్ట్‌గా పనిచేస్తున్నాడని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. అయితే జగన్ ఏజంట్‌గా బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యవహరిస్తున్నాడని చెప్పారు.

    అన్యాయం చేసిన వారికి మద్దతా

    అన్యాయం చేసిన వారికి మద్దతా

    ఏపీ రాష్ట్రానికి అన్యాయం చేసిన వారికి మద్దతు ఇస్తున్నారని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న నిప్పులు చెరిగారు. ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన హమీలను అమలు చేయకుండా బిజెపి రాష్ట్రానికి అన్యాయం చేసిందని బుద్దా వెంకన్న చెప్పారు. అయితే అదే సమయంలో ఏపీ రాష్ట్రానికి న్యాయం జరిగేలా బిజెపి కేంద్ర నాయకత్వంపై ఒత్తిడి తీసుకురాకుండా అన్యాయం చేసిన బిజెపికి మద్దతుగా సోము వీర్రాజు మాట్లాడడం సరైంది కాదన్నారు.

    రాష్ట్రాన్ని పడగొట్టాలని చూసేవారికి సహకారం

    రాష్ట్రాన్ని పడగొట్టాలని చూసేవారికి సహకారం

    ఏపీ రాష్ట్రానికి పడగొట్టాలని చూసేవారికి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్, బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు సహకరిస్తున్నారని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. చంద్రబాబునాయుడు నా హీరో అని తమిళ సూపర్ స్టార్ కమల్‌హసన్ చేసిన ప్రకటనను బుద్దా వెంకన్న గుర్తు చేశారు.

    మాటల తూటాలు

    మాటల తూటాలు

    ఏపీకి రాష్ట్రానికి న్యాయం చేయాలనే డిమాండ్ తో ఆందోళనలు సాగుతున్నాయి. ఈ తరుణంలో బిజెపి, టిడిపి నేతల మధ్య విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటు చేసుకొంటున్నాయి. ఏపీకి ఇచ్చిన హమీలను అమలు చేయడంలో బిజెపి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టిడిపి నేతలు చెబుతున్నారు. కానీ, ఏపీకి ఇచ్చిన హమీలను కేంద్రం అమలు చేసిందని బిజెపి నేతలు చెబుతున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+