మురళీ మోహన్ ఎఫెక్ట్, బాబు ఆగ్రహం: అది కాదు.. సినీ పరిశ్రమపై తగ్గిన రాజేంద్రప్రసాద్

అమరావతి: సినిమా పరిశ్రమపై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గురువారం చెప్పారు. బుధవారం ఆయన సినిమా పరిశ్రమపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

దీనిపై పలువురు మండిపడ్డారు. బీజేపీ నాయకురాలు, నటి కవితతో పాటు స్వయంగా టీడీపీ ఎంపీ మురళీ మోహన్ అధినేత చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు హోదా కోసం ఉద్యమిస్తుంటే పక్కదారి పట్టిస్తావా అని మండిపడ్డారు. దీంతో రాజేంద్ర ప్రసాద్ తగ్గారు.

TDP MLC regrets for his comments on tollywood

ఎవరినీ బాధపెట్టాలని తాను అలా మాట్లాడలేదని, సినిమావాళ్లు కూడా ఉద్యమంలోకి వస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందనేదే తన ఉద్దేశమని చెప్పారు. ముఖ్యమంత్రికి అండగా నిలవాలనే ఉద్దేశంతో తాను చేసిన వ్యాఖ్యల్ని వారు అర్థం చేసుకోవాలన్నారు.

చంద్రబాబు పడుతున్న కష్టానికి బాధ అనిపించే అలా మాట్లాడానన్నారు. క్లిష్టపరిస్థితుల్లో అందరూ ముఖ్యమంత్రికి అండగా నిలవాలన్నదే తన ఉద్దేశమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+