చంద్రబాబు ఆరోగ్యం పై ప్రధాని మోదీ ఆరా..!!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్కిల్ స్కాంలో 35 రోజులుగా రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ లో ఉన్నారు. చంద్రబాబు ఆరోగ్యం పై రెండు రోజులుగా చర్చ మొదలైంది. చంద్రబాబు డీహైడ్రేషన్ కు గురయ్యారని..శరీరంపై దద్దుర్లు వచ్చాయని జైలు అధికారులు నిర్దారించారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు మాత్రం ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తుండగా..జలై అధికారులు ఆయన భద్రత పై పూర్తి బాధ్యత తమదేనని స్పష్టం చేస్తున్నారు.

ప్రధాని మోదీ ఆరా: చంద్రబాబు ఆరోగ్యం పైన ప్రధాని మోదీ ఆరా తీసారాని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు. జీ20 పార్లమెంటరీ స్పీకర్ల సదస్సులో ప్రధాని మోదీని ఎంపీ కనకమేడల కలిసారు. ఈ సమయంలో చంద్రబాబు కేసుల అంశాన్ని ప్రధానికి వివరించినట్లు రవీంద్ర వెల్లడించారు.

Prime Minister Modi inquired about Chandrababus health

చంద్రబాబు ఆరోగ్యం పై ప్రధాని అడుగగా..ఆయన ఆరోగ్యం క్షీణిస్తుందని వివరించినట్లు చెప్పుకొచ్చారు. మరో వైపు చంద్రబాబు భద్రత, వైద్య సేవలపై దృష్టి సారించాలని కోరుతూ టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, కనకమేల రవీంద్ర కుమార్ లేఖ రాసారు. వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా ప్రయత్నిస్తోందని ఎంపీలు ఆరోపించారు.

వైద్యం అందించాలి: చంద్రబాబుకు స్పెషాలిటీ సేవలు అందించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇటు జైలు అధికారులు చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టత ఇచ్చారు. చంద్రబాబు హైప్రొఫైల్ ప్రిజనర్ కావటం తో ప్రత్యేకంగా స్నేహ బ్లాక్ ను కేటాయించి పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసామని చెప్పారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు.

ముగ్గురు వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని.. రోజుకు మూడు సార్లు వైద్య పరీక్షలు చేస్తున్నామని వివరించారు. చంద్రబాబు డీ హైడ్రేషన్ కు గురైనట్లు చెప్పటంతో వైద్యుల సూచన మేరకు ఓఆర్ఎస్ ద్రావణాన్ని అందచేసామని చెప్పారు. శరీరంపై దద్దుర్లు వచ్చినట్లు తెలపటంతో వైద్య నిపుణులను పిలిపించి పరీక్షించామన్నారు. ఆయన ఆరోగ్యం, భద్రతపై ఆందోళన వద్దని సూచించారు.

TDP MP Kanakamedala Ravindra Update

జైలు అధికారుల భరోసా: ఇటు వైసీపీ ముఖ్య నేతలు చంద్రబాబు ఆరోగ్యం పై టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు. చంద్రబాబు బరవు తగ్గారని చెబుతున్నారని...కానీ, చంద్రబాబు జైలుకు వచ్చిన సమయం కంటే కిలో బరువు పెరిగినట్లు అధికారులు వెల్లడించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు జైలుకు వచ్చే సమయానికి 66 కిలోల బరువు ఉండగా, తరువాత 68, ప్రస్తుతం 67 కేజీలు ఉన్నారని అధికారుల సైతం నిర్ధారించారు.

ప్రతీ వారం చంద్రబాబు భద్రత పైన ఎస్పీతో కలిసి సమీక్ష చేస్తున్నట్లు జైలు అధికారులు వివరించారు. ప్రతీ అంశం సీసీ కెమేరాల్లో నమోదవుతుందని చెప్పుకొచ్చారు. అయితే, అవసరమైతే .. వైద్యులు సూచన చేస్తే చంద్రబాబును రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+