వాలంటీర్ల వ్యవస్థపై ఎంపీ కేశినేని కీలక వ్యాఖ్యలు..!!

జనసేనాని పవన్ వ్యాఖ్యలతో ఇప్పుడు ఏపీ రాజకీయం వాలంటీర్ల వ్యవహారం చుట్టూ తిరుగుతోంది. ఇదే అంశం పైన టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేసారు. వాలంటీర్ల విషయంలో చంద్రబాబు వైఖరి పైనా స్పష్టత ఇచ్చారు. కొంత కాలంగా రాజకీయంగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కేశినేని నాని ఇప్పుడు వాలంటీర్ల గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో కీలక సూచనలు చేసారు.

పార్టీలకు అతీతంగా ఉండాలి
ఏపీలో వాలంటీర్ల వ్యవహారంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పందించారు. వాలంటీర్లు వ్యవస్థ పార్టీలకు అతీతంగా పనిచేయాలని అభిప్రాయపడ్డారు. వాలంటీర్లు ప్రజల కోసం పనిచేయాలని వ్యాఖ్యానించారు. ప్రజలకు పనిచేసే ఏ వ్యవస్థ అయినా మంచిదేనని చెప్పుకొచ్చారు. అది వాలంటీర్లు అయినా కావచ్చని పేర్కొన్నారు.

Kesineni Nani

టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలను ఇప్పుడు వాలంటీర్లు అంటున్నారంటూ కొత్త బాష్యం చెప్పారు. మంచి వ్యవస్థ ఉంటే కంటిన్యూ చేస్తామని చంద్రబాబు ఇప్పటికే చెప్పారని నాని గుర్తు చేసారు. ప్రతి వ్యవస్థలో మంచి చెడూ రెండూ ఉంటాయని వివరించారు. ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కోసం పని చేయకుండా ఉంటే వాలంటీర్లతో మకు ఇబ్బంది లేదని నాని పేర్కొన్నారు.

అందరినీ ఒకే గాటికి కట్టకూడదు
నలుగురు ఐదుగురు చెడ్డ వాళ్ళు ఉన్నారు అని వ్యవస్థను అంతా ఒకే గాటిన కట్టకూడదని కేశినేని నాని అభిప్రాయపడ్డారు. టీడీపీ ప్రజలకు మంచి చేసే ఏ వ్యవస్థనైనా ప్రోత్స హిస్తోందని చెప్పారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ వాలంటీర్ల వ్యవహారంలో చేసిన ఆరోపణలు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. దీని పైన వాలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేసారు.

TDP

పవన్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పుడు వీరికి పోటీగా జనసేన సైనికులు నిరసనలకు దిగారు. చంబ్రబాబు సైతం పవన్ చెబుతున్న అంశాలను ప్రజలు ఆలకిస్తున్నారంటూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను కేవలం ప్రజా సేవకు మాత్రమే పరిమితం చేస్తామని చంద్రబాబు స్పష్టం చేసారు.

రాజకీయంగా కీలక మలుపులు
అటు వైసీపీ నేతలు పవన్ వాలంటీర్ల పైన చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. పవన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పవన్ గతంలో చేసిన ఆరోపణల విషయంలో తాను అందరినీ ఉద్దేశించి మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో వాలంటీర్ల తీరు పైన పలు అనుమానాలు వ్యక్తం చేసారు. వాలంటీర్ వ్యవస్థ పైన న్యాయ పోరాటం చేస్తామని పవన్ ప్రకటించారు. ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ పైన జరుగుతున్న రాజకీయం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి కరంగా మారుతోంది. ఈ సమయంలో వాలంటీర్ల వివాదం ఎటువైపు టర్న్ అవుతుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+