Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైఎస్.. ఎ మాస్ లీడర్: కోట్లాది మందికి స్ఫూర్తిప్రదాత: తెలుగుదేశం ఎంపీ నివాళి

శ్రీకాకుళం: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ లోక్ సభ సభ్యుడు ఘనంగా నివాళి అర్పించారు. పార్టీలకు అతీతంగా ఆయన స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఓ మాస్ లీడర్ గా అభివర్ణించారు. కోట్లాదిమందికి స్ఫూర్తి ప్రదాత అని నివాళి అర్పించారు. ఆయనే- కింజరాపు రామ్మోహన్ నాయుడు. తెలుగుదేశం పార్టీకి చెందిన లోక్ సభ సభ్యుడు. వైఎస్ దశమ వర్ధంతి సందర్భంగా రామ్మోహన్ నాయుడు ఆయనకు నివాళి అర్పించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ట్యాగ్ చేయడం ఆసక్తి కలిగిస్తోంది.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మాత్రమే కాకుండా దక్షిణాది రాష్ట్ర ప్రజలకు స్ఫూర్తిని నింపిన గొప్ప నాయకుడని, రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. వైఎస్ పరిపాలన, ఆయన తీసుకున్న విధాన పరమైన నిర్ణయాలతో దక్షిణాది రాష్ట్రాల రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓ ఐకన్ గా చరిత్రలో నిలిచిపోయారని తన ట్వీట్ లో రాసుకొచ్చారు. వైఎస్ తో పాటు టీడీపీ మాజీ నాయకుడు దివంగత నందమూరి హరికృష్ణ జయంతి సందర్భంగా ఆయనకు కూడా రామ్మోహన్ నాయుడు నివాళి అర్పించారు.

TDP MP Rammohan Naidu have praised Chief Minister late YS Raja Sekhar Reddy on his death anniversary

ఒక తండ్రిగా, తెలుగు దేశం నేతగా, వెండి తెర హీరోగా హరికృష్ణ ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారని అన్నారు. టీడీపీకి ఆయన అందించిన సేవల వలన పార్టీ ఎంతో ఎదిగిందని అన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా, తండ్రికి రథసారథిగా, పార్టీకి జనానికి మధ్య వారధిగా నిలిచారని చెప్పారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నటుడిగా అద్భుతమైన కేరీర్ ను వదలుకుని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి అడుగు పెట్టడం గొప్ప నిర్ణయమని అన్నారు. యువతకు పవన్ కల్యాణ్ ఆదర్శంగా నిలిచారని కితాబిచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+