ఉపఎన్నికలు రావని తెలిసి ఎంపీలతో జగన్ డ్రామాలు, బీజేపీతో కుమ్మక్కు: కేశినేని-కొనకళ్ల

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరాటం అంతా కేసుల నుంచి బయటపడేందుకేనని టీడీపీ ఎంపీలు కేశినేని నాని, కొణకళ్ల నారాయణలు మంగళవారం ఆరోపించారు. ఉప ఎన్నికలు రావని తెలిసే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకసభ ఎంపీలు రాజీనామా డ్రామాలు ఆడుతున్నారన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలపై వైసీపీకి, జగన్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. ఈ మధ్యనే నలుగురు ఎంపీలు రాజీనామా చేస్తే ఆమోదించారని గుర్తు చేశారు. మరి వైసీపీ ఎంపీలవి ఎందుకు ఆమోదించడం లేదన్నారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే 2016లోనే రాజీనామాలు చేయాల్సి ఉండెనని టీడీపీ ఎంపీలు అన్నారు.

బీజేపీతో కుమ్మక్కై వైసీపీ నాటకాలు ఆడుతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో పోరాడుతోంది కేవలం టీడీపీయే అన్నారు. తమ ఎంపీలతో జగన్ రాజీనామా డ్రామా ఆడిస్తున్నారని అందరికీ అర్థమైందన్నారు.

TDP MPs see drama behind YSRCP Mps resignation

చంద్రబాబు నవ నిర్మాణ దీక్ష, మాలకొండయ్య గృహనిర్బంధం

నవ నిర్మాణ దీక్షలో భాగంగా సీఎం చంద్రబాబు మంగళవారంతూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో పర్యటించనున్నారు. అక్కడి బీజేపీ నేతలు అడ్డుకునేందుకు చూస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చంద్రబాబు పర్యటన సజావుగా సాగేలా చూసేందుకు భారీ ఎత్తున రంగంలోకి దిగిన పోలీసులు, ముందు జాగ్రత్త చర్యగా బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.

జిల్లా బీజేపీ అధ్యక్షుడు మాలకొండయ్యను గృహ నిర్బంధం చేశారు. ఆయన ఇల్లు దాటేందుకు వీల్లేదని చెప్పారు. ఆయన ఇంటి ముందు పోలీసులను మోహరించారు. దీంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చంద్రబాబును తాము అడ్డుకుంటామని ఎవరు చెప్పారని పోలీసులను ప్రశ్నించారు. మాలకొండయ్య గృహ నిర్బంధం గురించి తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.

మరోవైపు, ఈ ప్రాంతంలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. దీంతో వారి నుంచి కూడా వ్యతిరేకత వస్తుందన్న ఆలోచనతో కొందరు కాపు నేతలనూ హౌస్ అరెస్ట్ చేశారని తెలుస్తోంది. అమలాపురంలో జరిగే నవ నిర్మాణ దీక్షలో పాల్గొనేందుకు చంద్రబాబు ఈ ఉదయం రోడ్డు మార్గాన బయలుదేరుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+