హ్యాక్ అయిన టీడీపీ ట్విట్టర్ - స్పేస్ ఎక్స్ పోస్టింగ్స్ : లోకేష్ క్లారిటీ..!!
తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ ఎకౌంట్ హ్యాక్ అయింది. శుక్రవారం రాత్రి నుంచి హ్యాకర్లు టీడీపీ అధికారిక ఎకౌంట్ ను హ్యాకింగ్ చేసినట్లుగా గుర్తించారు. ఈ ఖాతా నుంచి విచిత్ర పోస్టులు కనిపిస్తున్నాయి. కొంత కాలంగా ప్రముఖ వ్యక్తులు..సెలబ్రెటీల ట్విట్టర్ ఖాతాలు హ్యాక్ గురువుతూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విట్టర్ ఎకౌంట్ సైతం హ్యాకింగ్ కు గురైంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందిన అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ కు గురైనట్లు టీడీపీ ఐటీ విభాగం గుర్తించింది. ఈ ఖాతా నుంచి విచిత్ర పోస్టింగ్ లు దర్శనమిస్తున్నాయి.
ఏకంగా ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు ట్వీట్లు చేశారు హ్యాకర్లు. స్టార్‌షిప్ ఫుల్ స్టాక్ టెస్టింగ్ జరుగుతుందని స్పేస్ ఎక్స్ ట్వీట్ చేయగా గ్రేట్ జాబ్, సూపర్ అంటూ టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ నుంచి రెస్పాన్స్ రావడంతో ఆందోళన మొదలైంది.టీడీపీ ట్విట్టర్‌లో స్పెస్ ఎక్స్ సంస్థకు రిప్లైలు ఇవ్వడంతో పాటు మరికొన్ని ట్వీట్లు చేశారు హ్యాకర్స్. టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్‌పై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పందించారు.

టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్‌కు గురైనట్లు ట్వీట్ చేశారు. ఈ అకౌంట్‌ని పునరుద్ధరించేందుకు ట్విట్టర్ ఇండియాతో మాట్లాడుతున్నామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అందరూ గమనించాలని లోకేష్ ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు దీని కారణంగా నష్టం జరగలేదని పార్టీ నేతలు చెబుతున్నారు.

అయితే, దీనిని సాధ్యమైనంత త్వరగా పునరుద్దిరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం పెగాసెస్ వ్యవహారం టీడీపీ పైన విమర్శలకు కారణం అవుతోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బెంగాల్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో టీడీపీ పైన వైసీపీ విమర్శలు ఎక్కు పెట్టింది. అయితే, దీని పైన ఇప్పటికే లోకేష్ క్లారిటీ ఇచ్చారు. తాము ఆ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేయలేదని స్పష్టం చేసారు. అదే విధంగా.. మాజీ డీజీపీ గతంలో సమాచార హక్కు చట్టం కింద ఏపీలో పెగాసెస్ కొనుగోలు చేయలేదని స్పష్టం చేయటంతో..ఇప్పుడు ఈ వ్యవహారం సద్దుమణిగింది. ఈ రోజు రేపు ఏపీ వ్యాప్తంగా మద్యం బ్రాండ్లు..అమ్మకాలకు వ్యతిరేంగా టీడీపీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications