పవన్ కు మద్దతుపై వర్మ బిగ్ ట్విస్ట్ - చంద్రబాబు చెప్పారంటూ..!!
ఏపీ ఎన్నికల్లో ఇప్పుడు పిఠాపురం హాట్ సీటుగా మారుతోంది. జనసేనాని పవన్ కల్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. పవన్ ప్రకటన చేసిన వెంటనే అక్కడ టీడీపీ నేత వర్మ మద్దతు దారులు ఆందోళనకు దిగారు. చంద్రబాబు బుజ్జగింపులతో వర్మ మొత్తబడ్డారు. పవన్ కు మద్దతిచ్చేందుకు ముందుకు వచ్చారు. అయితే, ఇప్పుడు వర్మ అనూహ్య ట్విస్ట్ ఇచ్చారు. పిఠాపురంలో పవన్ పోటీ..తన మద్దతు పైన కీలక వ్యాఖ్యలు చేసారు.
పిఠాపురం సీటు పైన వర్మ ఆశలు పెట్టుకున్నారు. 2014లోనూ పొత్తుల కారణంగా సీటు రాకపోవటంతో వర్మ స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేసి గెలుపొందారు. ఈ సారి పొత్తులో భాగంగా జనసేనాని పవన్ అక్కడ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో, వర్మ మద్దతు దారులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేసారు. మరోసారి స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేయాలని వర్మ పైన ఒత్తిడి తెచ్చారు. వర్మతో మాట్లాడిన చంద్రబాబు పొత్తు ధర్మంలో భాగంగా పవన్ గెలుపుకు సహకరించాలని సూచించారు. అధికారంలోకి వచ్చిన తరువాత వర్మకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు. దీంతో, వర్మ మెత్తబడ్డారు.

కానీ, తాజాగా వపన్ తాను ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి పోటీ చేద్దామని భావిస్తున్నానని...ఎంపీగా పోటీ చేయాల్సి వస్తే తాను, ఉదయ్ శ్రీనివాస్ సీట్లు మార్చుకుంటామని చెప్పుకొచ్చారు. దీంతో, ఇప్పుడు వర్మ స్పందంచారు. పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తేనే మద్దతిస్తానని తేల్చి చెప్పారు. ఎవరు పోటీ చేసినా పల్లిక మోయనని చెప్పారు. పవన్ పోటీ చేయకపోతో తానే పోటీ చేస్తానని స్పష్టం చేసారు. పవన్ చేయకపోతే తానే అభ్యర్దినని చంద్రబాబు చెప్పారని వెల్లడించారు. దీంతో, ఇప్పుడు పవన్ కాకుండా పిఠాపురం నుంచి ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తే వర్మ నుంచి సహకారం అందదనే విషయం స్పష్టం అవుతోంది.












Click it and Unblock the Notifications