జగన్ మూలాల పై చంద్రబాబు గురి - ఊహించని రాజకీయం..!!

ఏపీ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కూటమి పార్టీలు వైసీపీ లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్నాయి. వైసీపీ ముఖ్య నేతలు వరుసగా పార్టీ వీడుతున్నారు. కూటమి పార్టీల్లో చేరుతున్నారు. ఇదే సమయంలో జగన్ ను రాజకీయంగా ఫిక్స్ చేసేలా చంద్రబాబు కొత్త ప్రణాళికలతో సిద్దం అవుతున్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యులతో పాటుగా పలువురు ఎమ్మెల్సీలు పార్టీ మారుతున్నారు. ఇక, ఇప్పుడు జగన్ కు కంచుకోటగా ఉన్న పులివెందుల కేంద్రంగా మూలాల పైన గురి పెట్టిన చంద్రబాబు కీలక నిర్ణయానికి సిద్దమయ్యారు.

టార్గెట్ జగన్
2024 ఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయం ఒక్క సారిగా మారిపోయింది. జగన్ పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితం కావటంతో ఆ పార్టీలోని ముఖ్య నేతలు కూటమి పార్టీల్లో చేరుతున్నరు. సాయిరెడ్డి లాంటి కీలక నేతలు సైతం పార్టీ వీడుతున్నారు. కార్పోరేషన్లు, మున్సిపాల్టీల్లో పాగా వేసేందుకు కూటమి నేతలు పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీని బలహీన పర్చే లక్ష్యం తో చంద్రబాబు వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇదే సమయంలో జగన్ జిల్లాల పర్యటనలకు సిద్దం అవుతున్నారు. పార్టీ కేడర్, ప్రజలకు అందుబాటు లో ఉండాలని నిర్ణయించారు. ఇందు కోసం తాడేపల్లి నివాసంలో ప్రజాదర్భార్ నిర్వహణకు నిర్ణయించారు.

tdp-planning-to-organise-party-mahanadu-in-pulivendula-to-fix-ys-jagan

పులివెందుల వేదికగా
ఇటు, టీడీపీ నేతలు కూటమి వచ్చే ఎన్నికల్లోనూ కొనసాగాలని కోరుకుంటున్నారు. మిత్రపక్ష పార్టీ లతో సమన్వయంతో పని చేయాలని సూచిస్తున్నారు. ఇప్పుడు టీడీపీ నాయకత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. మే నెలలో టీడీపీ మహానాడు ఈ సారి కడపలో నిర్వహించాలని తాజాగా జరిగిన పోలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించారు. కాగా.. పులివెందులలో నిర్వహించేలా కడప జిల్లా టీడీపీ నేతలు ప్రతిపాద నలు చేసినట్లు తెలుస్తోంది. జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల వేదికగా తమ సత్తా చాటాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. 2024 ఎన్నికల్లో కడప జిల్లాలో అనూహ్య ఫలితాలు సాధించిన టీడీపీ.. తమ పట్టు కొనసాగించాలని భావిస్తోంది. అందులో భాగంగానే వ్యూహాత్మకంగా అధికారంలోకి వచ్చిన తరువాత నిర్వహిస్తున్న తొలి మహానాడు పులి వెందులలో నిర్వహించేలా ఆలోచన చేస్తోంది.

Take a Poll

జగన్ కు సవాల్
మహానాడు వేదికగా పార్టీ భవిష్యత్తు ప్రణాళికను చంద్రబాబు ఖరారు చేయనున్నారు. మహానాడు సమయానికి కూటమి ప్రభుత్వం దాదాపు ఏడాది పాలన పూర్తవుతుంది. దీంతో, రాజకీయంగానూ ఇక బలం పెరిగేలా నిర్ణయాలు ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారు. పులివెందులో మహానాడు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించి.. సక్సెస్ చేయటం ద్వారా కేడర్ లో జోష్ మరింత పెరుగుతుందనే అంచనాతో టీడీపీ నాయకత్వం ఉంది. ఇదే సమయంలో జగన్ ను రాజకీయంగా ఫిక్స్ చేయవచ్చ ని భావిస్తున్నారు. మహానాడు వేళ పార్టీ అంతా పులివెందులలోనే ఉండటం ద్వారా.. రాయలసీమ లోనూ పార్టీకి కలిసి వస్తుందని చెబుతున్నారు. అయితే, ఈ నిర్ణయం ద్వారా జగన్ పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది.. టీడీపీకి ఏ మేర రాజకీయంగా కలిసి వస్తుందనేది ఆసక్తి కరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+