ప్రాంతీయ తత్వం రెచ్చగొట్టేలా అబద్దపు రాతలు: సాక్షికి వ్యతిరేకంగా ఆందోళన

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: గుంటూరు నగరంలోని లాడ్జి సెంటర్‌లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సాక్షి దినపత్రికకు వ్యతిరేకంగా శుక్రవారం ఆందోళన చేపట్టారు.

ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతోందంటూ నిరసన ప్రదర్శన నిర్వహించాయి. గోదావరి నీళ్లను అక్రమంగా తరలిస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారు ఆరోపించారు.

చదవండి: అఖిలప్రియ తీరుపై చంద్రబాబు అసంతృప్తి

ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఈ సందర్భంగా మాట్లాడారు. సీలేరు నీటిని కృష్ణా డెల్టాకు ఇస్తున్నట్లు అబద్ధపు రాతలు రాశారని మండిపడ్డారు. తొమమ్మిది జిల్లాల రైతులు నష్టపోవాలన్నదే వైసిపి ఉద్దేశమని ధ్వజమెత్తారు. రైతులు కడుపుకొడుతున్న సాక్షిని బహిష్కరించాలని పిలుపునిచ్చారు.

TDP protest against Sakshi daily

నెల్లూరులో టిడిపి వర్సెస్ వైసిపి

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరులో ఉద్రిక్త వాతావ‌ర‌ణం చోటుచేసుకుంది. టిడిపి వ‌ర్గీయులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ‌ర్గీయులు ఘ‌ర్ష‌ణ‌కు దిగారు. ఒక‌రిపై ఒక‌రు దాడి చేసుకోవ‌డంతో ఉద్రిక్త‌త నెల‌కొంది.

ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అం‌దుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డ‌కు చేరుకుని లాఠీ ఛార్జి చేశారు. ప‌లువురు వైసిపి కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్టు చేశారు. టిడిపి, వైసిపి వ‌ర్గీయులు ఎందుకు ఘ‌ర్ష‌ణ ప‌డాల్సి వచ్చిందో తెలియాల్సి ఉంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugu Desam protest against YSR Congress Party chief YS Jaganmohan Reddy´s Sakshi daily.
Please Wait while comments are loading...