కూటమిలో చిచ్చు - బిజెపి vs టీడిపి, రోడ్డెక్కిన తమ్ముళ్లు..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక అధికారి నియామకం మూడు పార్టీల ఎన్డీఏ కూటమిలో చిచ్చకు కారణమైంది. మంత్రి సత్యకుమార్ కు వ్యతిరేకంగా టీడీపీ నిరసనకు దిగింది. మంత్రి తీరు పై మండిపడుతూ కాన్వాయ్ అడ్డగించారు. కానీ, సత్యకుమార్ మాత్రం తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. ఇప్పుడు నియోజకవర్గంలో ఈ వ్యవహారం కొత్త రచ్చకు కారణంగా మారుతోంది.
కమిషనర్ నియామకంతో
ధర్మవరం మున్సిపాలిటీ కమిషనర్‌గా మల్లికార్జునను నియమించడం ఎన్డీఏ కూటమిలో చిచ్చురగిల్చింది. వైసీపీ హయాంలో తమను వేధించిన అధికారిని తిరిగి కమిషనర్‌గా తీసుకురావడం ఏమిటని టీడీపీ శ్రేణులు కొన్నాళ్లుగా అసంతృప్తితో రగిలిపోతూ.. ఆందోళన చేస్తున్నారు. కానీ, మంత్రి సత్యకుమార్ మాత్రం్ కమిషనర్ మల్లికార్జునకు అండగా నిలిచారు. ధర్మవరం కమిషనర్‌గా మల్లికార్జున కొనసాగుతారని, అతనికి మంచి అధికారిగా పేరు ఉన్నందుకే అభివృద్ధి కోసం ఏరి కోరి తీసుకువచ్చానని మంత్రి చెప్పుకొచ్చారు.

టీడీపీ శ్రేణుల ఆందోళన
ఓటు వేసి గెలిపించిన ప్రజల శ్రేయస్సే తనకు ముఖ్యమని అన్నారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ధర్మవరంలోని ఎన్డీఏ కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో మంత్రి శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశానికి కమిషనర్ మల్లికార్జున హాజరయ్యారు. విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు భారీఎత్తున అక్కడికి చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. మున్సిపల్ కమిషనర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కమిషనర్ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అని నినాదాలు చేశారు. ఈ ధర్నా దాదాపు రెండుగంటల పాటు జరిగింది.

సత్యకుమార్ తీరుతో
టీడీపీ శ్రేణులకు నచ్చచెప్పడానికి పోలీసులు ప్రయత్నించారు. కానీ వారు వెనక్కి తగ్గలేదు. టీడీపీ నాయకుడు నరేంద్రచౌదరి వెళ్లి మంత్రి సత్యకుమార్‌యాదవ్‌తో సంప్రదింపులు జరిపారు. మంత్రి టీడీపీ శ్రేణుల వద్దకు వచ్చి మాట్లాడారు. కమిషనర్ నియామకం తన చేతిలో లేదని, ఏదైనా ఉంటే చంద్రబాబు తోమాట్లాడుకోవాలని సూచించి, కారు ఎక్కారు. దీంతో టీడీపీ కార్యకర్తలు మరింత ఆగ్రహానికి లోనయ్యారు. కష్టపడి గెలిపిస్తే తమకు ఇచ్చే బహుమానం ఇదేనా అని మంత్రిని నిలదీస్తూ.. ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ఇప్పుడు మంత్రి తీరుతో టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో ఉన్నాయి.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications