48 గంటలు వేచి చూడమంటే గంటలో మోడీకి షాకిచ్చారు: బాబు ఎదుట 2 ప్రశ్నలు!

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అందరూ ఊహించిందే చేశారు. బీజేపీకి కటీఫ్ చెబుతారని గత కొద్ది రోజులుగా అందరూ భావిస్తున్నారు. బుధవారం సాయంత్రం జైట్లీ ప్రకటన అనంతరం.. అర్ధరాత్రి చంద్రబాబు కేంద్ర కేబినెట్ నుంచి మంత్రులతో రాజీనామా చేయాలని నిర్ణయించారు.

ఏపీ పట్ల సానుభూతి, 2 అంశాలే మిగిలి ఉన్నాయి, మీరు కోరింది కాదు: జైట్లీ షాక్, బాబు కోర్టులోకి బంతి

  Ashok Gajapathi Raju and Sujana Chowdary quit Modi Cabinet

  ఇది అందరూ ఊహించిందే అయినా రెండు విషయాలపై టీడీపీ మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జైట్లీ, బీజేపీ మొదటి నుంచి అదే చెబుతోందని, అలాంటప్పుడు ఎన్నికలకు ముందు రాజీనామాలు గుర్తుకు వచ్చాయా అని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో కేబినెట్ నుంచి బయటకు వస్తామని చెబుతున్న చంద్రబాబు ఎన్డీయే నుంచి ఎందుకు వైదొలగడం లేదనేది ప్రశ్న అంటున్నారు.

  అరుణ్ జైట్లీ ప్రకటనతోనే ఆగ్రహమా?

  బుధవారం మధ్యాహ్నం చంద్రబాబు ఏపీ అసెంబ్లీలోనే తన నిర్ణయాన్ని పరోక్షంగానైనా ప్రకటిస్తారని భావించారు. అయితే వేచి చూడాలని నిర్ణయించారు. కానీ ఆ తర్వాత సాయంత్రం అరుణ్ జైట్లీ చేసిన ప్రకటన టీడీపీకి ఆగ్రహం కలిగించిందని అంటున్నారు. అందుకే చంద్రబాబు అర్ధరాత్రి ఈ ప్రకటన చేశారని చెబుతున్నారు.

  48 గంటలు వేచి చూడమన్నా

  ఏపీకి న్యాయం, ప్రత్యేక ప్యాకేజీ తదితర అంశాలపై 48 గంటల పాటు వేచి చూడాలని చంద్రబాబుకు బీజేపీ అధిష్టానం చెప్పిందా అంటే అవుననే అంటున్నారు. ఆ కారణంతోనే అసెంబ్లీలో ఆయన ఆచితూచి మాట్లాడారని, కానీ జైట్లీ ప్రకటనతో చంద్రబాబు అసంతృప్తికి లోనై వెంటనే కేబినెట్ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

  ఎన్డీయే నుంచి తప్పుకోలేదు

  టీడీపీ కేంద్రమంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరిలు రాజీనామాకు సిద్ధమయ్యారు. అంతకుముందే ఏపీలో బీజేపీ మంత్రులు రాజీనామా చేశారు. కేంద్రమంత్రుల రాజీనామా అనంతరం బీజేపీ అడుగులను బట్టి టీడీపీ ముందుకు వెళ్లనుంది. ఎన్డీయే నుంచి ఇంకా తప్పుకోలేదు.

  మంత్రులు రాజీనామా చేసే దాకా తెచ్చారు

  జైట్లీ వ్యాఖ్యలు చంద్రబాబును ఆగ్రహానికి గురి చేశాయని అంటున్నారు. దేశంలో ఆంధ్రప్రదేశ్‌ ఒక రాష్ట్రమని, మనమూ పన్నులు కడుతున్నామని, కేంద్రాన్ని వ్యతిరేకించానంటే రాష్ట్రం కోసమేనని, ఇప్పటికైనా నిర్ణయం తీసుకోకుంటే రాష్ట్రానికి నష్టం జరుగుతుందనే ఉద్దేశంతోనే బయటకు వచ్చామని, కేంద్ర బడ్జెట్‌ చూశాక తాను స్పందించి గట్టిగా మాట్లాడానని, దీన్ని అర్థం చేసుకోకపోగా కేంద్రం వ్యతిరేక ధోరణిలో మాట్లాడిందని బాబు మండిపడ్డారు. మంత్రులు రాజీనామా చేసే దాకా తెచ్చారన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Hours after Union Minister Arun Jaitley said that special category status cannot be given to Andhra Pradesh, the Telugu Desam Party (TDP) on Wednesday evening announced that it would walk out of the NDA. Andhra Pradesh CM Chandrababu Naidu has directed TDP ministers Ashok Gajapathi Raju and YS Chowdary to resign as Union Ministers.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి