ఫించన్లు పంపిణి, వైసీపీ నాయకుల పరువు తీసేసిన లీడర్, పంచాయితీలో రూ 10 లేదు
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వృద్ధులకి, వికలాంగులతో పాటు అర్హులు అయిన వారికి ఫించన్లు పంపిణీ చేస్తున్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసే విషయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ మాత్రం నెరవేర్చడం లేదని వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు.
వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు వైసీపీ నాయకులకు కౌంటర్ ఇస్తున్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ విషయంలో ఓ సర్పంచి వైసీపీ పరువు తీశాడు. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలోని సీతానగరం మండలంలోని సింగవరం సర్పంచి, తెలుగుదేశం పార్టీ నాయకుడు చిన్న పోశయ్య సైకిల్ తొక్కుతూ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణి చేస్తున్నామని వీధివీధి తిరుగుతూ ప్రచారం చేశారు.

ఇదే సమయంలో టీడీపీ సర్నంచి చిన పోశయ్య వైసీపీ నాయకుల పరువు తీసేశాడు. ఓ చేత్తో సైకిల్ తొక్కుతూ, మరో చేత్తో మైక్ పట్టుకొని ఫించన్లు తీసుకునే వాళ్లు శనివారం ఇంటి దగ్గరే ఉండాలని, ఎక్కడికి వెళ్ళకూడదని గ్రామం మొత్తం తిరుగుతూ ప్రచారం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీలో నిధులు మొత్తం ఖాళీ చేశారని తాను సర్పంచిగా గెలిపించినా ప్రజలకి సరైన న్యాయం చేయలేక పోయానని, ఇప్పుడు దండోరా వేయడానికి డబ్బులు కూడా లేవని సర్పంచి చిన్న పోశయ్య వైసీపీ పరువు తీశారు.
గత వైసీపీ ప్రభుత్వంలో సర్పంచిలకు ఏమాత్రం నిధులు మంజూరు చేయలేదని, పంచాయితీలకు వచ్చిన డబ్బు కూడా ఆ పార్టీ నాయకులే ఖాళీ చేశారని, మాకు ఏమత్రం డబ్బులు ఇవ్వలేదని టీడీపీ సర్పంచి చిన పోశయ్య ఆరోపించారు. ఫించన్లు పంపిణి చేస్తున్నారని దండోర వేసేందుకు ఎవరు ముందుకు రాలేదని, ఆటోలో ప్రచారం చేద్దామంటే పంచాయతీలో డబ్బులు లేవని, అందుకే తాను సైకిల్ తొక్కుతూ వీదివీది తిరుగుతున్నానని టీడీపీ సర్పంచి చిన్న పోశయ్య స్థానికులు చెప్పారు.
కూటమి ప్రభుత్వం లో పంచాయతీకి నిధులు మంజూరు అవుతాయని, వచ్చే నెల నుండి పింఛన్లు ఎప్పుడు ఇస్తారు అనే విషయంపై దండోరా వేయించి ప్రజలకు ముందుగానే సమాచారం ఇస్తామని సర్పంచి చిన్న పోశయ్య స్థానికులకు చెప్పారు. మొత్తం మీద గత వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీ నిధుల్లో కనీసం రూ.10 కూడా మిగల్లేదు అని సర్పంచి చిన్న పోశయ్య గ్రామం గ్రామం తిరుగుతూ ప్రచారం చేయడం తూర్పుగోదావరి జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో హాట్ టాపిక్ అయింది.












Click it and Unblock the Notifications