ఏపీ ప్రజలపై వర్ల రామయ్య ఫైర్: ఏం చేస్తాడని జగన్‌ను గెలిపించారు..!
టీడీపీ నేత వర్ల రామయ్య విచిత్ర వ్యాఖ్యలు చేసారు. జగన్ మీద విరుచుకుపడే వర్ల రామయ్య ఇప్పుడు ఏపీ ప్రజలను నిలదీస్తున్నారు. ఏం చేస్తాడని అవినీతి పరుడైన జగన్‌ను గెలిపించారంటూ ప్రశ్నిస్తున్నారు. తమను ఓడించి జగన్‌ను గెలిపించిన ప్రజల మీద టీడీపీకి కోపం వచ్చినట్లు ఉంది. ఏ రాజకీయ పార్టీ చేయేలని..అడగలేని ప్రశ్నలను సంధించి వర్ల రామయ్య కొత్త తరహా రాజకీయాలకు తెర లేపారు. ప్రజలను అభ్యర్దించి ఓట్లు వేయించుకోవటం ఆనవాయితీ. ప్రజలు తిరస్కరించినా..మీరు ఎందుకు వాళ్లకు ఓటు వేసారంటూ ప్రశ్నించటం మాత్రం ఎక్కడా లేదు. ఇప్పుడు వర్ల రామయ్య వాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్‌లో వైరల్‌గా మారుతున్నాయి.
ఆ క్రెడిట్ ఏపీ ప్రజలకే దక్కుతుంది...
తాజా ఎన్నికల్లో వైసీపీని గెలిపించిన ప్రజలను టీడీపీ నేత వర్ల రామయ్య తప్పు బడుతున్నారు. అవినీతి పరుడిని గెలి పించిన క్రెడిట్ ఏపీ ప్రజలకే దక్కుతుందని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజలు జగన్‌ను ఎలా గెలిపిస్తారని ఆయన ప్రజల ను ప్రశ్నిస్తున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని 23 స్థానాలకు పరిమితం కావటం పైన టీడీపీ నేతలు ఇంకా అసహ నం నుండి బయట పడినట్లు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలంతా ఏ1, ఏ2లకు అధికారం అప్పగించారు. 11 కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసిన ఘనత ఏపీ ప్రజలకే దక్కుతుందంటూ వ్యాఖ్యానిం చారు. జగన్ కడిగిన ముత్యంలా బయటకు వచ్చిన తరువాత ఓట్లు వేస్తే అర్దం ఉంది కానీ..కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఓట్లు ఎలా వేస్తారని..ఎలా గెలిపిస్తారనేది ఇప్పుడు వర్ల రామయ్య ప్రశ్న. అంటే ప్రజలు జగన్ చెబుతున్నట్లుగా తమ మీద నమోదైనవి రాజకీయ కేసులే అని భావిస్తున్నారా అనే సందేహం కూడా మొదలైంది.

ముఖ్యమంత్రి ఏ1 అంటూ అవే విమర్శలు..
వైసీపీని గెలిపించటం పైన ప్రజలను నిలదీసిన వర్ల రామయ్య దీనికి కొనసాగింపుగా ముఖ్యమంత్రితో పాటుగా వైసీపీ నేతల మీద ఆరోపణలు చేసారు. ఇప్పుడు ఏ3 సెర్బియాలో అరెస్ట్ అయితే, ఏ2(విజయసాయిరెడ్డి) ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారు. ఏ1 విదేశీ యాత్ర చేస్తున్నారు అంటూ ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక, సీనియర్ రాజకీయ నేతగా ఉంటూ..గతంలో పోలీసు అధికారిగా పని చేసిన వర్ల రామయ్య ఇలా ఓట్లు ఎందుకు వేసారు..ఎలా వేసారంటూ ప్రజల స్వేచ్చను ప్రశ్నించేలా వ్యవహరించటం మాత్రం వివాదాస్పదంగా మారుతోంది. దీని పైన ఇప్పుడు పార్టీ అధినేత చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications