టీడీపీకి మరో గవర్నర్ పదవి - ఆ మాజీ స్పీకర్ కే ఛాన్స్..!?
ఢిల్లీ కేంద్రంగా కీలక మంత్రాంగం కొనసాగుతోంది. బీజేపీ నూతన జాతీయ కార్యవర్గం ప్రకటించిన పార్టీ నేతలు.. ఇప్పుడు కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన తో పాటుగా కొత్త గవర్నర్ల నియామకం పైన తాజా గా కసరత్తు చేస్తున్నారు. అయిదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం పైన పలు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు పదవులు కేటాయిస్తున్నారు. టీడీపీకి మరో గవర్నర్ పదవి దాదాపు ఖాయమైంది. ఈ పదవి మాజీ స్పీకర్ కు ఇచ్చేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు సమాచారం.
కేంద్రం కొత్త గవర్నర్ల నియామకం పైన కసరత్తు చేస్తోంది. పార్టీ జాతీయ కార్యవర్గం ప్రకటన పూర్తి చేసారు. మంత్రివర్గ ప్రక్షాళన పైన కసరత్తు జరుగుతోంది. అయిదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించాల్సి ఉంది. అందులో భాగంగా రెండు పదవులు మిత్రపక్షాలకు ఇవ్వాలని కేంద్రం డిసైడ్ అయింది. టీడీపీకి మరో గవర్నర్ పదవి దక్కనుంది. ఇప్పటికే టీడీపీ నుంచి అశోక్ గజపతి రాజు గవర్నర్ గా అవకాశం దక్కించుకున్నారు. దీంతో.. ఇప్పుడు రెండో పదవి టీడీపీకి దక్కటం దాదాపు ఖాయమైంది. గవర్నర్ పదవి టీడీపీ నుంచి దక్కించుకొనేదెవరనే చర్చ మొదలైంది. అయితే, సామాజిక - ప్రాంతీయ సమీకరణాలతో పాటుగా అనుభవం పరిగణలోకి తీసుకొని అశోక్ గజపతి రాజుకు అవకాశం కల్పించారు. ఇప్పుడు పార్టీ నుంచి మరో గవర్నర్ గా సీనియర్ నేతలు.. మాజీ మంత్రులుగా పని చేసి.. స్పీకర్ గా వ్యవహరించిన ఇద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నాయని పార్టీ నేతల సమాచారం.

గవర్నర్ గా ముగ్గురి పేర్లు పరిశీలన
తాజాగా ఎమ్మెల్సీల నియామకంలోనూ ఎస్సీ- బీసీ (మహిళ) వర్గాలకు కేటాయించారు. ఇప్పుడు గవర్నర్ పదవి బీసీ లేదా ఎస్సీ వర్గం నుంచి మహిళకు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా బీసీ వర్గం నుంచి సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు పేరు రేసులో ముందంజలో ఉంది. టీడీపీ లో సుదీర్ఘ కాలం పని చేసిన యనమలకు ఇవ్వటం ద్వారా.. టీడీపీకి మద్దతుగా నిలిచే ప్రధాన వర్గానికి అవకాశం ఇచ్చినట్లు అవుతుందని భావిస్తున్నారు. అదే విధంగా కేఈ కృష్ణమూర్తి పేరు రాయలసీమ బీసీ వర్గం నుంచి పరిశీలనలో ఉంది. ఆయన తొలి నుంచి పార్టీనే నమ్ముకొని ఉన్నారు. గతంలో డిప్యూటీ సీఎంగానూ పని చేసారు. ఇక.. ఎస్సీ మహిళా నేతగా మాజీ స్పీకర్ ప్రతిభా భారతి పేరు పైన ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. వీరిలో యనమల, ప్రతిభా భారతి గతంలో స్పీకర్లుగా పని చేసారు. కాగా. .ఈ ముగ్గురు వారసుల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు.. ఒకరు ఎమ్మెల్సీ గా కొనసాగుతున్నారు. అయితే.. వీరిలో ఇప్పుడు చంద్రబాబు ఎవరికి గవర్నర్ గా అవకాశం ఇస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.













Click it and Unblock the Notifications